టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నేడు 37వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ధోనికి అభిమానులతో క్రికెటర్లు, బాలీవుడ్ ప్రముఖుల నుంచి ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అలాగే ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న ధోని పుట్టిన రోజును టీమిండియా క్రికెటర్లు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా పాండ్యా బ్రదర్స్ ‘హ్యాపీ బర్త్‌డే మహీ’ అంటూ పాడుతున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సాక్షి (ధోనీ భార్య)
“హ్యాపీ బర్త్ డే టూయూ! నువ్వెంత గొప్ప వ్యక్తివో చెప్పడానికి మాటలు సరిపోవు. గత పదేళ్లుగా నీ నుంచి నేనెంతో నేర్చుకుంటున్నాను. ఇదిలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంతో ప్రేమతో నా జీవితాన్ని ఆనందమయం చేసిన నీకు ధన్యవాదాలు.’
వీరేంద్ర సెహ్వాగ్
“ధోనీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీ జీవితం ఇప్పటి కంటే ఇంకా సంతోషంగా ఉండాలి. నీ స్టంపింగ్ కంటే జీవితంలో నువ్వు సాధించే విజయాలే వేగంగా ఉండాలి. ‘ఓం ఫినిషాయ నమ”
రవీంద్ర జడేజా
పుట్టిన రోజు శుభాకాంక్షలు ధోనీ. మాకు ఎన్నో ట్రోఫీలు తెచ్చిపెట్టినందుకు నీకు ధన్యవాదాలు.
కత్రినా కైఫ్
హ్యాపీ బర్త్‌డే ధోనీ! ఐసీసీ ట్రోఫీలన్నింటినీ సాధించి చరిత్ర సృష్టించిన ఏకైక కెప్టన్. నిన్ను చూసి గర్వపడుతున్నాను లెజెండ్. నీకంతా మంచే జరగాలి.
సురేశ్ రైనా
500 అంతర్జాతీయ మ్యాచ్‌ల ప్రయాణం. నీలాంటి లెజెండ్ పుట్టినందుకు భారతావని గర్విస్తోంది. హ్యాపీ బర్త్‌డే ధోనీ బ్రదర్. నువ్వేనాకు స్ఫూర్తి. అది ఎప్పటికీ అలాగే కొనసాగుతుంది. నీతో ఉన్న అన్ని సమయాలను నేనెప్పుడూ గుర్తు పెట్టుకుంటాను. నీలాగ ఎవ్వరూ ఉండలేరు మ్యాన్!
క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, సురేశ్ రైనా, మహ్మద్ కైఫ్, వినోద్ కంబ్లీ, రషీద్ ఖాన్, బుమ్రా, శిఖర్ ధావన్, మహ్మద్ షమీతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఇలా ఎంతో మంది ప్రముఖులు కోట్ల సంఖ్యలో అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు ధోనికి తెలిపారు. కాగా ఆదివారం ధోని తన 500వ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌ను ఆడనుండటం విశేషం.