కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో అంగన్వాడీ కార్యకర్త శాంతకుమారి (50) గుండెపోటుతో మృతి చెందారు. కొత్తపేట ఐసీడీఎస్ కార్యాలయం వద్ద నిరసనకు వెళ్తుండగా ఆమెకు ఛాతీలో నొప్పి రావడంతో అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తరలిం చేలోపే మార్గమధ్యంలో మృతి చెందారు. ఎన్నికల ముందు సీఎం జగన్ తమకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతూ అంగన్వాడీలు 37 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. పండుగలు, పబ్బాలు లేకుండా ఆందోళనలతో కదం తొక్కుతున్నారు. శాంతకుమారి సైతం క్రమం తప్పకుండా ప్రతిరోజూ సమ్మెలో పాల్గొన్నారు.