ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏకంగా ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టాటా ఏస్ వ్యాన్ను ఢీకొట్టింది ఓ లారీ.
అయితే.. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడక్కడే మృతి చెందారు. ఈ సంఘటనలోనే మరో 10 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతులు తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ట చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. ఇక ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.