Crime: హైదరాబాదులో న్యూ ఇయర్ వేళ భారీగా డ్రగ్స్ పట్టివేత..

Crime: Huge drug bust in Hyderabad on New Year..
Crime: Huge drug bust in Hyderabad on New Year..

కొత్త సంవత్సరం సమీపిస్తుండడంతో హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 10 రోజుల వ్యవధిలో రెండోసారి డ్రగ్స్ ను ఫిలింనగర్ లో స్వాధీనం చేసుకున్నారు. ఫిలింనగర్ లోని పబ్ పార్కింగ్ ఏరియాలో బెంగళూరుకు చెందిన క్యాబ్ డ్రైవర్ బాబు కిరణ్ డ్రగ్స్ అమ్ముతూ టాస్క్ ఫోర్స్ పోలీసులకు పట్టుపడ్డాడు. అనంతరం అధికారులు అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్ కి తరలించారు. అలాగే అతని నుంచి ఇరవై గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ ను స్వాధీన పరుచుకున్నారు.

అయితే గత కొంతకాలంగా బాబు కిరణ్ పబ్ కు వచ్చే కొంత మందికి డ్రగ్స్ అమ్మినట్టు సమాచారం. డ్రగ్స్ కొనుగోలు చేసిన వారిని అదుపులోకి తీసుకునేందుకు 4 బృందాలు రంగంలోకి దిగాయి. మరోవైపు బాబుకిరణ్ ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకు వస్తున్నాడు అనేదానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అంతేకాకుండా ఎంతకాలంగా అతడు డ్రగ్స్ బిజినెస్ జరుపుతున్నాడనే విషయంపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి పోలీసుల అదుపులో బాబు కిరణ్ ఉన్నాడు.ఇదిలా ఉంటే.. 10 రోజుల క్రితం ఎస్సార్ నగర్ లో 33 మంది డ్రగ్స్ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. డ్రగ్స్ ను పట్టుకునేందుకు పోలీసులు స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తుండడంతో పెద్ద ఎత్తున డ్రగ్స్ ముఠాలు పట్టుబడుతున్నాయి.