హైదరాబాద్ చంపాపేట్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది అనుమానాస్పద స్థితిలో ఓ యువతి మృతి చెందగా.. ఓ యువకుడు భవనం పైనుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. చంపాపేట్‌లోని రాజిర్దినగర్లోని ఓ ఇంట్లో స్వప్న అనే యువతి తన సోదరుడు హనుమంతుతో కలిసి నివసిస్తూ పనిచేస్తోంది. ఉదయం హనుమంతరావు ఇంటి నుంచి బయటకు వెళ్లే వెళ్ళాడు. అప్పుడే పెద్ద శబ్ధం వినిపించడంతో ఇంటి యజమాని బయటకు వచ్చాడు. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు బయటకు పరుగులు తీయడం గమనించాడు. నివాసితుల వద్దకు వెళ్లగా… అప్పటికే స్వప్న రక్తపు మడుగులో పడి ఉంది. భవనంపై నుంచి పడిపోయిన మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన యువకుడిని కాట్రవత రాజుగా గుర్తించారు. సౌత్ ఈస్ట్ డీసీపీ రోహిత్ రాజ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.