Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మేనమామ సూపర్ హిట్ పాటలను రీమిక్స్ చేసి సక్సెస్‌ను దక్కించుకుంటున్నాడు. ఇప్పటికే గువ్వా గోరింకతో మరియు అందం హిందోళం అంటూ మంచి పేరు దక్కించుకున్న తేజూ తాజాగా ‘ఇంటిలిజెంట్’ చిత్రంలో చిరంజీవి మరో సూపర్ హిట్ సాంగ్ అయిన చమక్ చమక్ చామ్‌ను రీమిక్స్ చేయడం జరిగింది. ఇళయరాజా స్వరపర్చిన ఈ పాటను వినాయక్ ఏరికోరి మరీ ఈ చిత్రంలో రీమిక్స్ చేయడం జరిగింది. ఈ పాటపై మెగా ఫ్యాన్స్‌తో పాటు అంతా కూడా చాలా అంచనాలు పెంచుకున్నారు. తాజాగా విడుదలైన ఈ పాట ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యింది.
తేజూ గత రీమిక్స్ పాటలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అయితే ఈసారి మాత్రం ఉన్నది ఉన్నట్లుగా ఏమాత్రం మార్పు చేయకుండా దాన్నే రీమిక్స్ అంటూ తీసుకు రావడంతో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సాహిత్యంతో పాటు ట్యూన్‌ను కూడా ఉన్నది ఉన్నట్లుగానే తీసుకు వచ్చారు. సింగర్స్‌ను మార్చి రీమిక్స్ అంటున్నారని సోషల్ మీడియాలో పంచ్‌లు పడుతున్నాయి. ఇక ఈ పాటను సింగర్స్ అంతగా ఆకట్టుకునే విధంగా పాడటంలో విఫలం అయ్యారు. ఒరిజినల్ సాంగ్ ఫ్లేవర్ కొడుతూ ఉన్న ఈ పాట సినిమాకు హైలైట్ అవుతుందనే నమ్మకం లేదని సినీ విశ్లేషకులు పెదవి విరిస్తున్నారు. కాస్త భిన్నంగా ఉండి, సింగర్‌ను మార్చి ఉంటే బాగుండేది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఫిబ్రవరి 9న మెగా ‘ఇంటిలిజెంట్’ రాబోతున్న విషయం తెల్సిందే. లావణ్య త్రిపాఠి, తేజూలు ఈ చిత్రంలో చాలా అందంగా కనిపిస్తున్నారు. మొత్తం పాటలో వీరి జోడీ ఎలా ఉంటుందో చూడాలి.