చంద్రబాబు మీద సంచలన వ్యాఖ్యలు చేసారు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు. తన తోడల్లుడు వింత జాతికి చెందిన వ్యక్తని ఉదయం ఒకమాట సాయంత్రం మరోమాట మాట్లాడే స్వభావమంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన్ను చూస్తే జాలేస్తోందని సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు, కామెంట్లను తానైతే భరించలేనని అన్నారు. ముఖ్యమంత్రి సీట్లో తానైతే గంట కూడా కూర్చోలేని పెర్కొన్నరు. చంద్రబాబు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే పనిని ఇంటెలిజెన్స్ ఐజీకి అప్పగించారని అంతేకాక పార్టీలో ఉన్న అసంతృప్త నేతలకు కాంట్రాక్టులు కట్టబెడతామంటూ ఇంటెలిజెన్స్ ఐజీ ప్రలోభాలకు గురి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆ పోలీసు అధికారి ఆస్తులు కొనుగోలు, అమ్మకాలపై జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు.
గతంలో పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకించిన చంద్రబాబు ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ క్రెడిట్ కోసం ఆరాపటుడుతున్నారని పోలవరం గురించి పోరాడుతున్న యర్రా నారాయణస్వామిని చంద్రబాబు మందలించారని అప్పుడు వద్దన్న చంద్రబాబు ఇప్పుడు మొత్తం తానే కడుతున్నానని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. పార్లమెంట్లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు విషయంలో చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరించారని పార్లమెంటులో విగ్రహం పెట్టే అవకాశం ఉన్నా చంద్రబాబు పట్టించుకోలేదని అన్నారు. అప్పటి స్పీకర్ మీరా కుమార్కు పురందేశ్వరి విజ్ఞప్తి చేయడంతో ఎన్టీఆర్ విగ్రహం పార్లమెంట్లో పెట్టగలిగారని అన్నారు. రాజకీయాలు వద్దనుకున్నానని ప్రశాంతంగా రిటైర్ అవ్వాలనుకున్నానని వెంకటేశ్వరరావు చెప్పారు. అందుకే హితేష్ ని రాజకీయాల్లోకి తీసుకొచ్చామని అన్నారు. పర్చూరు నియోజకవర్గం నుంచి తన కుమారుడు హితేష్ పోటీ చేస్తారని చెప్పారు. జగన్ తో కలిసి నడవడం చాలా సంతోషంగా ఉందని జగన్ ప్రజల కోసం పడుతున్న కష్టం చూసి వైసీపీలో చేరబోతున్నట్లు తెలిపారు.