Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పాకిస్థాన్ ఎంత ప్రమాదకర దేశమో ప్రపంచానికి తెలియచెప్పే విధంగా ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కొ్న్ని వ్యాఖ్యలుచేశారు. ఆయన తమ దేశాన్ని, తమ ప్రవర్తనను సమర్థించుకునే ప్రయత్నంలో ఈ మాటలు చెప్పినప్పటికీ….అసలు నిజం మాత్రం అనుకోనిరీతిలో బయటపెట్టారు. 1993 ముంబై పేలుళ్ల కేసు సూత్రధారి దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ లో ఉన్నాడని 25 ఏళ్ల నుంచి భారత్ ఆరోపిస్తూనే ఉంది. అండర్ వరల్డ్ డాన్ గా ఉంటూ… ముంబై పేలుళ్లతో దేశ ఆర్థిక రాజధానిలో మారణకాండను సృష్టించిన దావూద్.. పేలుళ్ల తర్వాత పాకిస్థాన్ కు పారిపోయాడు. అక్కడినుంచే భారత్ లో అండర్ వరల్డ్ వ్యవహారాలు చక్కబెడుతున్నాడు.
ఈ విషయం ప్రపంచమంతా తెలుసు. కానీ పాకిస్థాన్ ను దోషిగా నిలబెట్టేందుకు సరైన ఆధారాలు లేవు.పాక్ లో ప్రముఖ నగరాల్లో ఒకటైన కరాచీలో దావూద్ ఇబ్రహీం అత్యంత విలాసవంతంగా జీవిస్తున్నాడని, . దావూద్ రక్షణ బాధ్యత పాక్ ఆర్మీ చూసుకుంటోందని ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి.దీనిపై భారత్ అనేక సార్లు పాకిస్థాన్ ను హెచ్చరించింది. దావూద్ ను భారత్ కు అప్పగించాలని ఎన్నో సందర్భాల్లో కోరింది. కానీ పాక్ మాత్రం ఆ వాదనలను తోసిపుచ్చేది. దావూద్ తమ దేశంలో లేడని పదే పదే చెబుతూవచ్చింది. కానీ దావూద్ పాక్ లోనే ఉన్నాడని ఇప్పుడు ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ పరోక్షంగా అంగీకరించి ప్రపంచాన్ని నివ్వెరపరిచాడు. అంతేకాదు…ముంబై మారణ హోమంలో 260 మంది ప్రాణాలను బలిగొన్న దావూద్ ను ముషారఫ్ వెనకేసుకొచ్చాడు కూడా.
భారత్ పాక్ సంబంధాలపై ఓ పాకిస్థానీ చానెల్ తో మాట్లాడిన ముషారప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎంతోకాలంగా భారత్ పాక్ ను దూషిస్తోందని, అలాంటప్పుడు దావూద్ విషయంలో పాక్ భారత్ కు ఎందుకు సాయం చేయాలని ముషారఫ్ ప్రశ్నించారు.ఈ క్రమంలోనే దావూద్ పాకిస్థాన్ లో ఎక్కడో ఓ చోట ఉండొచ్చని అంగీకరించాడు. భారత్ ముస్లింలను చంపేస్తోందని, దానికి దావూద్ దీటుగా ప్రతిస్పందిస్తున్నాడని కూడా మెచ్చుకోవటం ద్వారా ఉగ్రవాదంపై ఆ దేశ వైఖరి ఏమిటో చెప్పకనే చెప్పాడు ఈ మాజీ అధ్యక్షుడు.ఉగ్రవాదంపై చర్యలు తీసుకోకపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల చేసిన హెచ్చరికలపై స్పందిస్తూ పాకిస్థాన్ ఎన్నో చిలక పలుకులు పలికింది. ఉగ్రవాదంపై తాము ఎంతో కాలంగా పోరాడుతున్నామని, అసలు ఉగ్రవాదం వల్ల తమ దేశానికి జరిగినంత నష్టం ఎవరికీ జరగలేదనీ వ్యాఖ్యానించింది. పైకి మాత్రం ఇలాంటి మాటలు చెప్పే పాకిస్థాన్ ఆచరణలో మాత్రం కరుడుగట్టిన ఉగ్రవాదులకు తమ దేశంలో ఆశ్రయం ఇస్తోంది. భారత్ కు వ్యతిరేకంగా కుట్రలు పన్నేందుకే దావూద్ ఇబ్రహీం, హఫీజ్ సయీద్ వంటి ఉగ్రవాదులను పాక్ వాడుకుంటోందన్న విషయం ముషారఫ్ వ్యాఖ్యలతో మరోసారి రుజువయింది.
మరిన్ని వార్తలు: