మ‌ర‌ణ ర‌హ‌స్యం ముందే తెలిస్తే!!

Untitled-3-5

  Posted [relativedate]

మనం ఎన్నేళ్లు బతుకుతామో కచ్చితంగా తెలుసుకోవడం సాధ్యం కాదు. జ్యోతిష్యుడు కూడా సరిగ్గా అంచనా వేయలేడు. ఇక ముందు మాత్రం ఇది అసాధ్యం కాదు. ఎందుకంటే కొత్తరకం పరీక్ష ఒకటి అందుబాటులోకి రాబోతున్నది. ఒక్కసారి టెస్ట్ చేసుకుంటే చాలు.. ఎన్నేళ్లు జీవిస్తామో.. సరిగ్గా తెలిసిపోతుంది.

అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు సరికొత్త అంశాన్ని కనుగొన్నారు. ఒక రక్త పరీక్షతో ఒక మనిషి ఎన్ని సంవత్సరాలు జీవించవచ్చో తెలుసుకోవచ్చట. ఇందుకోసం సైంటిస్టులు బయోమార్కర్ వ్యవస్థను అభివృద్ధి చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. ఒక వ్యక్తి జీవిత కాలాన్ని అంచనా వేసేందుకు ఓ బయోమార్కర్‌ వ్యవస్థను అభివృద్ధిచేశారు. దీనికోసం 5,000 మంది రక్త నమూనాలపై పరిశోధన చేపట్టారు. వాటిని దానంచేసిన వ్యక్తుల ఆరోగ్య వివరాలను ఎనిమిదేళ్ల పాటు పరిశీలించారు. ముఖ్యంగా ఏళ్లు పైబడటంతో వచ్చే క్యాన్సర్‌, గుండెపోటు, మధుమేహం వంటి వ్యాధుల లక్షణాలు, వాటి బయోమార్కర్లను గుర్తించారు. వీటితో 26 భిన్న బయోమార్కర్లు కలిగిన తాజా అంచనాల వ్యవస్థను సిద్ధంచేశారు.

రక్త నమూనాలోని బయోమార్కర్లను వీటితో సరిపోల్చడంతో ఎన్నేళ్లు బతకగలమో చెప్పొచ్చట. ఈ పద్ధతిలో తొలినాళ్లలోనే వివిధ వ్యాధుల ముప్పులనూ గుర్తించే వీలుందని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే ఫలితాల్లో ఖచ్చితత్వం పెంచేందుకు లోతైన పరిశోధన జరుగుతోందట. తొందర్లోనే ఆ విషయంలోనూ క్లారిటీ రావడం ఖాయమంటున్నారు.

ఎంతైనా మనం ఎంతకాలం జీవిస్తామో ముందే తెలిస్తే.. అది కొంచెం ఆసక్తికర అంశమే. ఆ జీవితకాలం లోపు చేయాల్సిన పనులన్నీ చేసేయొచ్చు. అనుకున్నవన్నీ పూర్తి చేసి నిశ్చితంగా ఈ లోకం నుంచి వెళ్లిపోవచ్చని కొంతమంది అనలిస్టుల మాట.