Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు గడ్డ మీద నుంచి వస్తున్న ఇంగ్లీష్ పత్రికల్లో డెక్కన్ క్రానికల్ కి ప్రత్యేక స్థానం. మీడియా మొఘల్ గా భావించే రామోజీ సైతం ఆంగ్ల పత్రిక నిర్వహణలో సక్సెస్ కాలేకపోయారు. కానీ డెక్కన్ క్రానికల్ సక్సెస్ కావడమే కాదు ఓ ట్రెండ్ క్రియేట్ చేసింది. ఆ సక్సెస్ కి తగ్గట్టే అందులో పనిచేసే ఉద్యోగుల జీతభత్యాలు ఉండేవి. ఒక్కో సందర్భంలో ఉద్యోగులకు కార్లు బహుమతిగా ఇచ్చిన రోజులు లేకపోలేదు. అయితే రోజులు ఎప్పుడూ ఒకే విధంగా వుండవు కదా. ఇప్పుడు డెక్కన్ క్రానికల్ ఓ దినపత్రికగా ఎక్కడా వెనుకపడలేదు. అయితే దాన్ని నిర్వహిస్తున్న యాజమాన్యమే ఆర్ధిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. దీంతో కిందటి నెల లో జీతాలు 17 తారీఖు తర్వాత పడ్డాయట. ఇక ఈ నెలలో పరిస్థితి అగమ్యగోచరంగా ఉందట. సంస్థ నిర్వహణ మాత్రమే కాదు దాన్ని విక్రయించేందుకు కూడా వీలు లేని విధంగా యాజమాన్యం ఉందట.
డిజిటల్ మీడియా దూసుకొస్తున్న ఈ తరుణంలో ఓ దినపత్రిక నిర్వహణ కష్టంగా మారుతున్న ఈ రోజుల్లోనూ డెక్కన్ క్రానికల్ విజయవంతంగా నడుస్తోంది. ఆదాయం బాగుంది. ఉద్యోగుల పని తీరు కూడా బాగుంది. అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు తయారైన పరిస్థితి నెలకొంది. దీంతో ఉద్యోగులు టెన్షన్ పడుతున్నారు.
మరిన్ని వార్తలు