దీని భావమేమి దినకరన్..?

police files chargesheet In the TTV dinakaran bribery case

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

దినకరన్ ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో గట్టి సాక్ష్యాలున్నాయని నిన్నటివరకు అదరగొట్టిన ఢిల్లీ పోలీసులు .. ఇప్పుడు సైలంటయ్యారు. దినకరన్ పాత్ర ఉందని నిరూపించే ఆధారాల్లేవని కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ లో పేర్కొన్నారు. దీంతో ఆయనపై అభియోగాలు తొలగిపోయినట్లే. ఈ వార్త తెలిసిన దగ్గర్నుంచి దినకరన్ సన్నిహితులు సంబరాలు చేసుకుంటున్నారు.

మొన్నటివరకూ ప్రధాన నిందితుడిగా ఉన్న దినకరన్.. ఇప్పుడు నిర్దోషి ఎలా అయిపోయాడు. పోలీసుల ఛార్జిషీట్ పై కోర్టు ఎలా స్పందిస్తునేది కూడా ఆసక్తికరమే. దినకరన్ కేసులో ఇరుక్కోవడంతో ఆర్కేనగర్ ఉపఎన్నికలు కూడా వాయిదా పడ్డాయి. అలాంటి సమయంలో ఆయన నిర్దోషి అని పోలీసులు చెప్పకనే చెబుతుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

జయ మరణం తర్వాత పన్నీర్ ను పావుగా మార్చుకున్న కేంద్రం.. ఆయన్ను సీఎం చేయడానికి ట్రై చేసింది. అయితే సెల్వానికి అంత సీన్ లేదని గ్రహించి.. మళ్లీ తమిళనాడు సీఎం పళనిస్వామిని దువ్వింది. తప్పక పన్నీర్, తప్పనిసరై పళని ఇద్దరూ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి కోవింద్ కు మద్దతు ప్రకటించారు. అందుకు ప్రతిఫలంగానే దినకరన్ ను కేసుల నుంచి విముక్తు చేశారేమోనని పొలిటికల్ పండిట్స్ అంటున్నారు.

మరిన్ని వార్తలు

మత్తుగాళ్లను ప్రభుత్వమే కాపాడుతోందా..?

మేనేజర్ ను దాచేసిన దిలీప్