గ్లోబల్ ఛార్ట్స్ లో “దేవర” మూవీ సెన్సేషన్.!

"Devara" Movie Sensation in Global Charts.!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “దేవర కోసం అని అందరికీ తెలిసిందే. మరి ఈ మూవీ నుంచి మేకర్స్ రీసెంట్ గానే అవైటెడ్ ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయగా ఇది పాన్ ఇండియన్ చార్ట్ బస్టర్ గా నిలిచిపోయింది .

"Devara" Movie Sensation in Global Charts.!
“Devara” Movie Sensation in Global Charts.!

అనిరుద్ (Anirudh) కంపోజ్ చేసిన ఈ ఫియర్ సాంగ్ అయితే ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో సెన్సేషన్ ని సెట్ చేస్తుంది. వరల్డ్ వైడ్ గా యూట్యూబ్ మ్యూజిక్ ఛార్ట్స్ లో ఈ ఫియర్ సాంగ్ ప్రస్తుతం టాప్ 100 పాటల్లో 29వ స్థానంలో ట్రెండ్ అవుతూ ఉండడం పెద్ద విశేషం. దీనితో ఈ సాంగ్ సెన్సేషన్ ఏ లెవెల్లో ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు.

ఇప్పటికే తెలుగు, హిందీ భాషల్లో అయితే భారీ రెస్పాన్స్ ను కొనసాగిస్తుంది. దీనితోనే గ్లోబల్ ఛార్ట్స్ లో కూడా అదరగొట్టడం పెద్ద విశేషం. ఇక ఈ భారీ మూవీ లో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ అక్టోబర్ 10న మూవీ పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కానున్నది .