Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బెంగళూరు పద్మనాభనగర్‌లో తన తండ్రి దేవేగౌడతో భేటీ అయి సుదీర్ఘంగా చర్చించిన తరువాత జేడీఎస్ నేత కుమారస్వామి తుది నిర్ణయం ప్రకటించారు. కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ మద్దతు లభించడంతో రాష్ట్ర గవర్నర్‌కు కుమారస్వామి ఓ లేఖ రాశారు. ఈ రోజు సాయంత్రం 5.30నుంచి 6 గంటల మధ్య గవర్నర్‌ను కలిసేందుకు తమకు అపాయింట్మెంట్ కావాలని, తాము కాంగ్రెస్ మద్దతును అంగీకరిస్తున్నామని ఆ లేఖలో కుమారస్వామి పేర్కొన్నారు. అయితే స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన ఇద్దరి మద్దతు కూడా తమకే ఉందని ఇప్పటికే కుమారస్వామి ప్రకటించారు. అలాగే కాంగ్రెస్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వండతో పాటు… కేబినెట్ కూర్పుపై కూడా మంతనాలు సాగినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దేవెగౌడ కాంగ్రెస్ 20 పదవులు… జేడీఎస్ 14 ఇవ్వాలని షరతు పెట్టారని తెలుస్తోంది. అందుకే సాయంత్రం గవర్నర్ అపాయింట్మెంట్ కూడా అడిగినట్లు తెలుస్తోంది.
బీజేపీ ముఖ్య నేతలు, కేంద్రమంత్రులైన జేపీ నడ్డా, జవదేకర్లను బెంగళూరుకు చేరుకున్నారు. జేడీఎస్ అధినేత దేవెగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణ బీజేపీతో టచ్‌లో ఉన్నారట… ఆయనకు ఓ 10మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందట. అందుకే ఆయన సాయంతో అధికారాన్ని చేపట్టాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇదే సమయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తమకు అవకాసం ఇవ్వాలని బీజేపీ కూడా రాష్ట్ర గవర్నర్ ని అపాయింట్మెంట్ కోరింది. అయితే కాంగ్రెస్, జేడీఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఇరు పార్టీల నేతలు ఇప్పటికే ప్రకటించారు. అయితే గవర్నర్ అపాయింట్మెంట్ ఇంకా ఇవ్వకపోవడం, ఆ వెంటనే బీజేపీ నేతలు గవర్నర్ అపాయింట్మెంట్ కోరడంతో రాజకీయ సమీకరణలు మారనున్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పుదుచ్చేరి లోలాగా కాంగ్రెస్ ఆశలపై నీళ్లు చల్లి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని గత ఎన్నికల పరిణామాలే చెబుతున్నాయి.