కర్ణాటక 23వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కుమారస్వామి

Kumaraswamy takes Oath as Karnataka CM

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కర్ణాటక రాష్ట్రానికి 23వ ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత హెచ్ డీ కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరులోని విధానసౌధలో కుమారస్వామి సీఎంగా ప్రమాణం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ వాజుభాయి వాలా దగ్గరుండి కుమారస్వామితో ప్రమాణం చేయించారు. కాగా సీఎం గా ప్రమాణస్వీకారం చేయడం కుమారస్వామికి ఇది రెండవ సారి. ఆయన వయసు 59… బీఎస్సీ వరకు చదువుకున్న ఆయన… 1996లో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడైన కుమారస్వామి… 2006లోనూ ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టారు. ఆయనకి ఇద్దరు భార్యలు ఇద్దరు పిల్లలు.

అలాగే ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ నేత పరమేశ్వర ప్రమాణ స్వీకారం చేశారు. 67 సంవత్సరాల పరమేశ్వర పీహెచ్‌డీ పట్టా పొంది అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రస్తుతం కేపీసీసీ అధ్యక్షుడిగానూ ఉన్నారు. ఆయనకు గతంలో ఆ రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, జేడీఎస్ నేత దేవెగౌడ, ఏపీ సీఎం చంద్రబాబు, కోల్ కతా సీఎం మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి తోపాటు కాంగ్రెస్, జేడీఎస్ నేతలు హాజరయ్యారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో పాటు బీఎస్పీ అధినేత్రి మాయావతి సహా పలువురు నేతలు హాజరయ్యారు.