కోలీవుడ్ టాలెంటెడ్ హీరో ధనుష్ హీరోగా నటించిన రీసెంట్ సినిమా “సార్” తో తన కెరీర్ లో మంచి హిట్ ని అందుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం తర్వాత తన కెరీర్ లో భారీ చిత్రం “కెప్టెన్ మిల్లర్” రిలీజ్ తో ఇప్పుడు సిద్ధంగా ఉండగా ఈ సినిమాపై కూడా ధనుష్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ని అందిస్తున్నాడు. అయితే ఈ చిత్రం తర్వాత తన కెరీర్ బెంచ్ మార్క్ చిత్రం 50వ సినిమా కోసం తెలిసిందే.
ఈ చిత్రాన్ని తానే స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించగా ఈ సినిమాపై ఒక ఇంట్రెస్టింగ్ సర్ప్రైజింగ్ అప్డేట్ అందించాడు. మరి ఈ చిత్రం షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యిపోయినట్టుగా చెప్పడం ఆసక్తిగా మారింది. అలాగే తన చిత్ర యూనిట్ కి గాను థాంక్స్ చెప్తునట్టుగా తెలిపాడు. వారితో పాటుగా నిర్మాతలు సన్ పిక్చర్స్ కళానిధి మారన్ లు నా విజన్ ని నమ్మినందుకు థాంక్స్ చెప్తున్నానని తెలిపాడు.