Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగురాష్ట్రాల్లోని పలు జిల్లా కేంద్రాలకు, ముఖ్యపట్టణాలకు ఇకపై పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరా రానుంది. ఇందుకోసం పెట్రోలియం, నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్ 86 ప్రదేశాలు ఎంపికచేసింది. తొమ్మిదోసారి నిర్వహిస్తున్న బిడ్ లో 86 కేంద్రాలకు బిడ్ లు ఆహ్వానిస్తున్నట్టు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. ఇప్పటికే కాకినాడ, విజయవాడ, హైదరాబాద్, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లాల్లో పలు సంస్థలు టెండర్లు దక్కించుకున్నాయి. హైదరాబాద్, విజయవాడ, కాకినాడలో భాగ్యనగర్ గ్యాస్ టెండర్లు దక్కించుకోగా…తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో గోదావరి గ్యాస్ ప్రయివేట్ లిమిటెడ్, కృష్ణా జిల్లాలో మెగా ఇంజనీరింగ్ ఇన్ ఫ్రా గ్యాస్ సరఫరా చేయనున్నాయి.
తొమ్మిదోసారి నిర్వహిస్తున్న బిడ్ లో ఏపీ నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలను ఎంపిక చేశారు. తెలంగాణలోని 20 జిల్లాల్లో పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరా కానుంది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, మెదక్, సిద్ధిపేట, సంగారెడ్డి, మేడ్జల్, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, సూర్యాపేట, భువనగిరి జిల్లాలను పెట్రోలియం, నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్ ఎంపిక చేసింది. బిడ్ కు సంబంధించిన టెండర్లు అక్టోబరులో ప్రకటించనున్నారు.