టాలీవుడ్ దర్శకుడు శ్రీను వైట్ల ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసిన సినిమా ఢీ. ఎంతో వినోదభరితంగా సాగే ఈ సినిమా ఆద్యంతం ఎంతో ఆసక్తిని రేకెత్తించేలా సాగుతుంది. కాగా ఈ సినిమా.. హీరో విష్ణుకి మంచి విజయాన్ని కట్టబెట్టిందనే చెప్పాలి. నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్ అంటూ బ్రహ్మానందం చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులని కడుపుబ్బ నవ్విస్తాయి. శ్రీహరి నటన ప్రేక్షకులని మంత్రముగ్దుల్ని చేస్తుంది. కాగ ఈ మధ్య ఈ సినిమాకి సంబంధించి సీక్వెల్ కూడా తెరకెక్కిస్తారనే ప్రచారం సాగింది. ఈ విషయంపై స్పందించిన విష్ణు.. ఆ విషయాన్ని దర్శకుడినే అడిగి క్లారిటీ తీసుకోమని కూడా చెప్పాడు.
కాగా ఢీ సినిమా రిలీజై సరిగ్గా ఈరోజుకి 13 ఏళ్లు పూర్తియింది. ఏప్రిల్ 13, 2007న రిలీజైన ఢీ సినిమాపై తాజాగా దర్శకుడు శ్రీను వైట్ల తన పాత జ్ఞాపకాలని నెమరు వేసుకున్నారు. ఢీ తనకు చాలా ప్రత్యేకమైన చిత్రంగా తెలిపాడు. అదేవిధంగా ఈ సినిమా అప్పుడు ప్రతిరోజూ షూట్ చేయడం చాలా సవాలుగా ఉన్నప్పటికీ.. చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరు దీనిని చాలా సులువుగా అధిగమించారని చెప్పారు. ఇంకా ఈ సినిమా తనకు మెమోరబుల్ జ్ఞాపకం అని కూడా అన్నారు. ‘నా నిర్మాత, స్నేహితుడు ఎంఎస్ ఎన్ రెడ్డికి నా ప్రత్యేక ధన్యవాదాలు’ అని శ్రీను వైట్ల తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అలానే నా సోదరుడు విష్ణుకి హృదయపూర్వక ధన్యవాదాలు.. శ్రీహరి, బ్రహ్మానందం, సునీల్, జేపీతో పాటు కోనవెంకట్, గోపి మోహన్, చక్రి, తదితర బృందం అందరికి ప్రత్యేక ధన్యవాదాలు అని శ్రీను వైట్ల ట్వీట్ ద్వారా వివరించారు. మొత్తానికి సీక్వెల్ ఉంటుందో ఉండదో అన్న విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు