మలితరం మల్టీస్టారర్స్‌ను ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’తో మొదలు పెట్టిన దిల్‌రాజు వరుసగా మల్టీస్టారర్ చిత్రాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన వెంకటేష్ మరియు వరుణ్‌లతో ‘ఎఫ్ 2’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఈ మల్టీస్టారర్‌ను దిల్‌రాజు నిర్మిస్తున్నాడు. తాజాగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో మరో మల్టీస్టారర్ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. ఇంద్రగంటి దర్శకత్వంలో మల్టీస్టారర్‌కు ముందు హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఒక మల్టీస్టారర్ చేయాలని దిల్‌రాజు భావించాడు. కాని ఆ చిత్రం పట్టాలెక్కలేదు.
‘డీజే’ చిత్రం పూర్తి అవ్వగానే హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘దాగుడు మూతలు’ అనే ఒక మల్టీస్టారర్‌ను చేయబోతున్నట్లుగా దిల్‌రాజు ప్రకటించాడు. ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ చర్చలు జరిగాయి. స్క్రిప్ట్ వర్క్‌తో పాటు లొకేషన్స్ కోసం అమెరికా వెళ్లి పలు లొకేషన్స్‌ను దర్శకుడు హరీష్ శంకర్ ఫైనల్ చేసి వచ్చాడు. అతి త్వరలోనే హీరోలు ఎవరు అనేది ప్రకటించి, చిత్రీకరణ ప్రారంభించబోతున్నట్లుగా దిల్‌రాజు ఆఫీస్ నుండి ప్రకటన వచ్చింది. అయితే దిల్‌రాజు ఆ ప్రాజెక్ట్‌ను పక్కకు పెట్టేసినట్లుగా తెలుస్తోంది. కారణం తెలియదు కాని ప్రస్తుతానికి ‘దాగుడు మూతలు’ చిత్రాన్ని నిలిపేసినట్లుగా చెబుతున్నారు. ఒకవేళ హరీష్ శంకర్‌తో ఆ చిత్రాన్ని కూడా దిల్‌రాజు నిర్మిస్తే ఎక్కువ మల్టీస్టారర్ చిత్రాలను నిర్మించిన నిర్మాతగా దిల్‌రాజు రికార్డును సాధిస్తాడు. మరి దిల్‌రాజు దాగుడుమూతలు మల్టీస్టారర్ ఎప్పుడు చేస్తాడో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.