దిల్ రాజు రిస్క్.. అటు బాలయ్య.. ఇటు దళపతి.. ఏం చేయనున్నాడు..?

Dil raju
Dil raju

టాలీవుడ్లో ఇప్పుడు ఉన్న స్టార్ నిర్మాతలో దిల్ రాజు ఒకరు ఈయన ప్రొడ్యూసర్ గా మంచి విజయం సాధించాడు. గతంలో మీడియా బడ్జెట్ తోనే సినిమాలు నిర్మించే దిల్ రాజు ఇప్పుడు హై బడ్జెట్ సినిమాలను కూడా నిర్మిస్తున్నాడు. నిర్మాతగా మాత్రమే కాదు డిస్ట్రిబ్యూటర్ గా కూడా రాణిస్తున్నాడు. నైజాం ఏరియాలో డిస్టిబ్యూటర్ గా టాప్ లో ఉన్నాడు.

ఏ సినిమా అయిన ఈయన వద్దు అనుకుంటేనే వేరే వారి దగ్గరికి వెళ్తుంది.ఇక దిల్ రాజు పంపిణి చేస్తున్నాడు అంటే ఆ సినిమా హిట్ అయినట్టే అనే టాక్ ఉంది.ఇక ఇప్పుడు దసరా సీజన్ లో రిలీజ్ కాబోయే రెండు సినిమాల హక్కులను కూడా ఈయనే సొంతం చేసుకున్నాడు.మరి ఓకే సీజన్లో రిలీజ్ కాబోతున్న రెండో సినిమాలను దిల్ రాజు ఎలా డివైడ్ చేస్తున్నాడు.

అనే దానిపై అందరిలో ఆసక్తి పెరిగింది.నందమూరి నటసింహం బాలయ్య హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”భగవంత్ కేసరి” . దసరా కానుకగా అక్టోబర్ 19న రిలీజ్ అవుతుండగా ఈ సినిమాను దిల్ రాజు కొనుక్కున్నారు.అలాగే విజయ్ దళపతి హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లియో కూడా అదే రోజు రిలీజ్ కాబోతుంది.

ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ అవుతుండగా రెండు కూడా దిల్ రాజునే డిస్టిబ్యూట్ చేస్తున్నాడు.మరి ఇద్దరు కూడా స్టార్ హీరోలే.ఇటీవలే విజయ్ వారిసు సినిమాను నిర్మించి విజయ్ కు బాగా దగ్గర అయ్యాడు.దీంతో విజయ్ లియో( Leo ) కూడా ఈయనే సొంతం చేసుకున్నాడు.ఇటు బాలయ్య కూడా స్టార్ హీరో.మరి మంచి సెంటర్స్ లో ఉన్న థియేటర్స్ ను ఎవరికీ కేటాయిస్తారు అనే దానిపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తుంది.