Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్‌లో దిల్‌రాజుకు ఒక బ్రాండ్ ఉంది. ఆయన నిర్మించిన సినిమాలు మినిమం గ్యారెంటీగా ఆడుతాయని, ఆయన డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాలు ఖచ్చితంగా లాభాలను తెచ్చి పెడతాయనే టాక్ ఉంది. ఇప్పటి వరకు దిల్‌రాజు డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాల్లో సక్సెస్ రేట్ చాలా ఎక్కువ. అందుకే ఏదైనా సినిమాను దిల్‌రాజు తీసుకున్నాడు అంటే వెంటనే ఆ సినిమాపై అంచనాలు పెరిగి పోతాయి. చిన్న సినిమా అయినా కూడా దిల్‌రాజు చేతిలో పడ్డది అంటే అదో పెద్ద సినిమా అయిపోవడం ఖాయం. నైజాం ఏరియా రైట్స్‌ను దిల్‌రాజు తీసుకుంటే ఇక ఆ సినిమా ఇతర ఏరియాల్లో బిజినెస్ భారీగా అవ్వడం ఖాయం. ఇదే గత కొన్ని సంవత్సరాలుగా ట్రెండ్ నడుస్తూ వస్తుంది.
ఇటీవలే దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ‘గౌతమ్ నంద’ చిత్రం నైజాం రైట్స్‌ను 6 కోట్లకు దిల్‌రాజు దక్కించుకున్నాడు. దిల్‌రాజు చేయి పడటమే ఆలస్యం ‘గౌతమ్ నంద’ చిత్రం స్థాయి అమాంతం పెరిగి పోయింది. అంతకు ముందు వరకు పెద్దగా ఆ సినిమా గురించి పట్టించుకోని వారు ఇప్పుడు ఆ సినిమా కోసం కోట్లు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. దాంతో బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా ‘జయ జానకి నాయక’ చిత్రాన్ని కూడా దిల్‌రాజు పేరు చెప్పి భారీ మొత్తానికి అమ్మాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని భారీ మొత్తానికి అమ్మాలంటే దిల్‌రాజు చేయి పడితే కాని అమ్మడం సాధ్యం కాదు. అందుకే దిల్‌రాజుతో నైజాం ఏరియా రైట్స్‌ను కొనుగోలు చేయించి దాన్ని ప్రచారం చేసి ఇతర ఏరియాల్లో భారీగా అమ్మేయాలనేది ఆ చిత్ర నిర్మాతల ప్లాన్‌గా తెలుస్తోంది. ఇప్పటికే దిల్‌రాజు ‘జయ జానకి నాయక’ చిత్రాన్ని 9 కోట్లకు కొనుగోలు చేసినట్లుగా ప్రచారం మొదలైంది. దాంతో ఇతర ఏరియాల్లో కూడా డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేసేందుకు సిద్దం అవుతున్నారు. దిల్‌రాజు బ్రాండ్‌ను బోయపాటి టీం ఇలా వాడేస్తుందన్నమాట.
మరిన్నివార్తలు