శశికళ కోరిక తీర్చిన దినకరన్.

Dinakaran Became Favour to Sashikala

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తమిళనాడులో జయ మరణం తర్వాత తలెత్తిన రాజకీయ అనిశ్చిత పరిస్థితికి ఆర్కే నగర్ ఉప ఎన్నికల ఫలితాలు ఫుల్ స్టాప్ పెడతాయా ? ఇప్పటికిప్పుడు ఎస్ అని చెప్పకపోయినా జయ విషయంలో మీడియా శశికళ ని విలన్ గా ప్రొజెక్ట్ చేసినా ఆర్కేనగర్ అసెంబ్లీ ఓటరు ఆ విషయాన్ని నమ్మలేదని అర్ధం అవుతోంది. ఇంత అనిశ్చిత పరిస్థితుల్లో కూడా ఏ రాజకీయ అండ లేకుండా దినకరన్ గెలవడం మాములు విషయం కాదు. రాష్ట్రంలో శశికళ మద్దతుతో సీఎం పీఠం ఎక్కిన పళనిస్వామి, పన్నీర్ సెల్వం తో కలిసి శశికళకి హ్యాండ్ ఇచ్చారు. ఇక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అయితే శశి అండ్ కో ని పగబట్టినట్టు వేటాడింది. ఎన్ని దాడులు, ఎన్ని కేసులు పెట్టినా, శశికళ జైల్లో వున్నా, అన్నాడీఎంకే గుర్తు లేకపోయినా దినకరన్ గెలవడం మాములు విషయం కాదు. ఈ ఓటమిని జీర్ణించుకోలేని వారు డబ్బులతో రాజకీయం చేశారని ఆరోపించవచ్చు. కానీ ఇప్పుడు తమిళనాట వున్న పరిస్థితుల్లో డబ్బుతో మొత్తం పని అయిపోతుందని అనుకుంటే అంత కన్నా పొరపాటు లేదు.

జైల్లో ఉన్నప్పటికీ శశికళ కోరికను ఆమె మేనల్లుడు దినకరన్ తీర్చాడు.ఒక్క దెబ్బకి రాజకీయ ప్రత్యర్థులందరికీ కోలుకోలేని షాక్ ఇచ్చాడు. శశి చలవతో సిఎం గద్దెనెక్కిన పళనిస్వామికి, శశి ని వ్యతిరేకించిన పన్నీర్ సెల్వం కి, వారిద్దరి మధ్య వారధిగా నిలిచి ఇప్పుడు ఆర్కేనగర్ బరిలో దిగిన మధుసూదన్ కి నోట మాట రాకుండా పోయింది. అన్నాడీఎంకే శ్రేణులు మళ్లీ శశికళ వైపు మళ్లేలా చేయడంలో ఈ ఫలితం కీలక పాత్ర పోషించడం ఖాయం. ఇక అన్నాడీఎంకే మధ్య విభేదాలతో ఆర్కే నగర్ ఎన్నికల్లో లబ్ది పొందుదాం అనుకున్న డీఎంకే కి ఈ రిజల్ట్ పెద్ద షాక్. ఓటమి కన్నా అక్కడ వచ్చిన ఓట్లు చూసి డీఎంకే శ్రేణులే నిరాశలో పడ్డాయి. ఇక అందరికన్నా పెద్ద దెబ్బ తింది బీజేపీ. శశికళ అండ్ కో ని దెబ్బ కొట్టడానికి జయ మరణం తర్వాత కేంద్రం ఎంతగా కక్షసాధింపు చేసినా తమిళ ఓటరు మనసు కించిత్ కూడా మారలేదు. గెలుపు విషయం పక్కనబెడితే ఆర్కే నగర్ లో నోటా కి వచ్చిన ఓట్లలో సగం కూడా బీజేపీ అభ్యర్ధికి రాలేదు. దీన్ని బట్టి చూస్తే బీజేపీ వ్యవహారశైలి పట్ల తమిళులు ఎంత ఆగ్రహంతో వున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఈ ముగ్గురు రాజకీయ ప్రత్యర్థుల్ని దెబ్బ కొట్టి జైల్లో వున్న శశికళ కోరిక తీర్చాడు దినకరన్.