మెగా హీరోకు దేవుడు వరమందిస్తే..!

Director Karunakaran And Sai Dharam Tej Movie Title Devudu Varamandisthe

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ఇటీవలే ‘ఇంటిలిజెంట్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వినాయక్‌ దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఏమాత్రం ఆకట్టుకోలేక పోయిన ఆ చిత్రంను తేజూ ఎందుకు చేశాడా అంటూ అంతా కూడా విమర్శించారు. సినిమా ఫలితాన్ని పక్కన పెట్టి తన తర్వాత సినిమాపై తేజూ ఫోకస్‌ పెట్టాడు. సాయి ధరమ్‌ తేజ్‌ ప్రస్తుతం కరుణాకరన్‌ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తున్నారు. పలు అద్బుతమైన ప్రేమ కథా చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన కరుణాకరన్‌ తనకు తప్పకుండా విజయాన్ని ఇస్తాడనే నమ్మకంతో తేజూ ఉన్నాడు. తన ప్రతి సినిమాకు విభిన్న టైటిల్స్‌ను పెట్టే కరుణాకరన్‌ తాజాగా ఈ చిత్రానికి కూడా ఒక విభిన్న టైటిల్‌ను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది.

కరుణాకరన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సాయి ధరమ్‌ తేజ్‌కు జోడీగా అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘దేవుడు వరమందిస్తే’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. దేవుడు వరమందిస్తే నీ నిన్నే కోరుకుంటాలే.. అంటూ ఒక పాటు అప్పట్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే ఈ సినిమాకు ఆ టైటిల్‌ను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. సాయి ధరమ్‌ తేజ్‌ బాడీలాంగ్వేజ్‌కు తగ్గ స్టోరీని మంచి స్క్రీన్‌ప్లేతో కరుణాకరన్‌ తెరకెక్కిస్తున్నాడు. సమ్మర్‌ కానుకగా రాబోతున్న ఈ సినిమా అయినా తేజూకు సక్సెస్‌ను తెచ్చి పెడుతుందేమో చూడాలి.