Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరున్న క్రిష్ తాజాగా బాలయ్య 100వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ తెరకెక్కించి మంచి సక్సెస్‌ను అందుకున్నాడు. భారీ స్థాయిలో అంచనాల నడుమ సంక్రాంతికి భారీ పోటీ మద్య విడుదలైన ఆ సినిమా బాలయ్య కెరీర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టింది. ఆ చిత్రంతో బాలీవుడ్లో ఒక భారీ చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం దక్కించుకున్నాడు. మరో చారిత్రాత్మక నేపథ్యంతో క్రిష్ బాలీవుడ్లో కంగనా రనౌత్ హీరోయిన్గా ‘మణికర్ణిక’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. త్వరలోనే ఆ సినిమాను విడుదల చేయబోతున్నాడు. ఆ చిత్రం తర్వాత క్రిష్ పవన్‌తో చిత్రాన్ని చేసేందుకు కథ సిద్దం చేస్తున్నాడు.
ఇప్పటికే ఒక పవర్ ఫుల్ స్టోరీ లైన్‌ను సిద్దం చేశాడు. త్వరలోనే పూర్తి స్థాయి స్టోరీని సిద్దం చేసి, పవన్‌కు వినిపిస్తాను అంటున్నాడు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ సినిమాలు చేసే అవకాశం చాలా తక్కువగా ఉంది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ వచ్చే నెలలో పూర్తి కాబోతుంది. ఆ తర్వాత వెంటనే సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమాకు కమిట్ అయ్యాడు. ఆ సినిమా చేస్తాడా చేయడా అనే విషయంపై క్లారిటీ లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు సిద్దం అవుతున్నాడు.
ముందుగా అనుకున్న ప్రకారం అక్టోబర్‌లోనే జనసేన పార్టీని సీరియస్‌గా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని భావించాడు. కాని అది సాధ్యం కాలేదు. ఇక నవంబర్‌లో లేదా డిసెంబర్ అయినా జనసేన పార్టీ నిర్మాణంను జరపాలని, అందుకు సంబంధించిన సభ్యత్వ నమోదును చేయాలని నిర్ణయించారు. త్వరలోనే అందుకు సంబంధించిన కార్యచరణ సిద్దం చేస్తున్నారు. ఈ సమయంలో క్రిష్‌తో సినిమాకు పవన్ ఒప్పుకుంటాడా అనేది అనుమానమే. పవన్ 2019 ఎన్నికలు పూర్తి అయిన తర్వాత క్రిష్‌కు డేట్లు ఇచ్చే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. క్రిష్‌కు పవన్‌తో సినిమా చేయాలనే కోరిక ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.