Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టీతిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ నియామకాలు జరిగే కొన్నిరోజుల ముందు ఆ పదవి చేపట్టనున్నారంటూ అనేకమందిపై ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఫలానా ప్రముఖుడికి ఆ పదవి దక్కనుంది. ఈ సారి ఖాయంగా ఆయనే టీటీడీ చైర్మన్ అవుతారు అంటూ న్యూస్ చానళ్లు, వార్తాపత్రికలు వార్తలు ప్రసారం చేస్తూ ఉంటాయి. జనం కూడా వారి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు సోషల్ మీడియా కూడా తోడవడంతో ఇలాంటి వార్తలు ఇంకా వేగంగా వ్యాప్తిచెందుతున్నాయి. అలా రెండు,మూడు రోజులు నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ ఎక్కువగా వినిపిస్తున్న వార్త ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టనున్నారని. ఈ వార్తలు చూసి చాలామంది నిజమనుకుని రాఘవేంద్రరావుకు అభినందనలు కూడా తెలియజేస్తున్నారు. అయితే ఈ వార్తలను దర్శకేంద్రుడు ట్విట్టర్ లో కొట్టిపారేశారు. ఈ వార్తల్లో నిజంలేదని ఆయన స్పష్టంచేశారు. తాను టీటీడీ చైర్మన్ కానున్నానని జరుగుతున్న ప్రచారం చూసి వేలాదిమంది అభినందనలు తెలియజేస్తున్నారని ఆయన చెప్పారు. ఎస్వీఎస్సీ ఛానల్ ద్వారా స్వామివారికి సేవ చేస్తున్నానని ఆయన స్పష్టంచేశారు. శ్రీవారి కార్యక్రమాలను మరింత వైవిధ్యంగా రూపొందించి భక్త జన కోటిని అలరిస్తూ ఆయన సేవలో తరించాలన్నది ఒక్కటే తన కోరిక అని రాఘవేంద్రరావు ట్వీట్ చేశారు.