చాలా కాలం తర్వాత ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంతో దర్శకుడిగా సక్సెస్‌ను దక్కించుకున్న దర్శకుడు తేజ తన తదుపరి చిత్రంగా ‘ఎన్టీఆర్’ను చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది. అయితే ఆ సినిమాను తాను మోయలేను అని, ఆ స్థాయి దర్శకుడిని తాను కాదు అంటూ తేజ తప్పుకున్నాడు. తేజ అలా చెప్పినప్పటికి అలా చెప్పించింది వేరే వారు అయ్యి ఉంటారు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ చిత్రం నుండి తప్పించుకున్న వెంటనే దర్శకుడు తేజ తన తదుపరి చిత్రాన్ని వెంకటేష్‌తో చేయాలని భావించాడు. కాని ఆయన డేట్లు ఖాళీ లేకపోవడంతో నాగార్జున వద్దకు కథతో వెళ్లాడు. అక్కడ కూడా ఛాన్స్ దక్కలేదు. చివరకు ఒక ప్రముఖ నిర్మాత వద్దకు వచ్చి తేజ ఆగాడు.
ప్రముఖ నిర్మాత దానయ్య తన తనయుడిని హీరోగా పరిచయం చేసేందుకు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. గతంలో పలువురిని హీరోలుగా పరిచయం చేసి, సక్సెస్‌లను అందించిన దర్శకుడు తేజ తన కొడుకుకు కూడా సక్సెస్‌ను అందిస్తాడనే నమ్మకంను దానయ్య వ్యక్తం చేస్తున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఆ సినిమాను స్వయంగా దానయ్య నిర్మించబోతున్నాడు. ప్రేమ కథ చిత్రాల ఎక్స్‌పర్ట్‌గా పేరున్న దర్శకుడు తేజ ఇదే సంవత్సరం చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో దానయ్య కొడుకుతో సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా సక్సెస్ అయితే తప్ప తేజకు మళ్లీ స్టార్స్ నుండి ఛాన్స్‌లు దక్కవు అంటూ సినీ వర్గాల వారు భావిస్తున్నారు.