Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా బాలకృష్ణ చేయబోతున్న ప్రతిష్టాత్మక ‘ఎన్టీఆర్’ చిత్రంకు ఆరంభంలోనే గట్టి దెబ్బ తలిగింది. దర్శకుడు తేజ ఈ చిత్రం నుండి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించాడు. తాను ఎన్టీఆర్ కథకు న్యాయం చేయలేను అనే ఉద్దేశ్యంతో తప్పుకుంటున్నట్లుగా తేజ ప్రకటించినా కూడా సినీ వర్గాల్లో మరియు మీడియా వర్గాల్లో మాత్రం వేరే విధంగా ప్రచారం జరుగుతుంది. బాలకృష్ణ కావాలని తేజను తప్పించాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
బాలకృష్ణకు మొదటి నుండి తేజపై నమ్మకం లేదని, మరో దారి లేక తేజను ఈ చిత్రం కోసం మొదట ఎంపిక చేయడం జరిగిందని అంటున్నారు. గతంలోనే తేజ ఈ చిత్రం నుండి తప్పుకుంటున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే సినిమా ప్రారంభోత్సవంలో తేజ కనిపించడంతో ఆ వార్తలు నిజం కాదని, ఈ చిత్రాన్ని తేజ తెరకెక్కించబోతున్నట్లుగా భావించాం. కాని తాజాగా స్వయంగా తాను సినిమాను వదిలేస్తున్నాను అంటూ ప్రకటించిన నేపథ్యంలో సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది.
‘ఎన్టీఆర్’ సినిమా స్క్రిప్ట్ విషయంలో తేజ జ్యోక్యం అస్సలు వద్దని బాలకృష్ణతో పాటు నిర్మాతలు కూడా చెబుతున్నారు. స్క్రిప్ట్ వర్క్ అంతా పూర్తి అయిన తర్వాత మాత్రమే తేజకు బాధ్యతలు అప్పగించాలని బాలయ్య భావించాడు. తాను అనుకున్నట్లుగా, తెలుగు దేశం పార్టీకి ఫేవర్‌గా మాత్రమే స్క్రిప్ట్ ఉండాలనేది బాలయ్య నిర్ణయం. అందుకే తేజను స్క్రిప్ట్ చర్చల్లో భాగంగా దూరంగా ఉంచారు. ఒకటి రెండు సలహాలు బాలయ్యకు తేజ చెప్పిన నేపథ్యంలో వాటిని పరిగణలోకి తీసుకోలేదు. అందుకే చేసేది లేక తేజ ‘ఎన్టీఆర్’ చిత్రం నుండి తప్పుకున్నాడు అంటూ మరికొందరు అంటున్నారు. మొత్తానికి తేజ తప్పుకోవడం వల్ల ఎన్టీఆర్ చిత్రం ఆలస్యం అవ్వడంతో పాటు, ఫలితంలో తేడా కూడా వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల వారు చెబుతున్నారు.