తమిళ రాజకీయాల్లో కురువ్రుద్దుడిగా పేరుగాంచిన కరుణానిధి ఈరోజు తన తుది శ్వాస విడిచారు. తమిళ రాజకీయాల్లో సుధీర్గ కాలం సీఎంగా పనిచేసిన ఆయన గత కొద్ది రోజుల నుండి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత కొన్నేళ్ళగా ఆయన చక్రాల కుర్చీకే పరిమితం అయినా జూలై 29న తీవ్ర అస్వస్థతతో కావేరీ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. అయితే దేశంలోని రాజకీయ, సినీ రంగ ప్రముఖులు అందరూ ఆయన్ని పరామర్శించారు, అయితే అనూహ్యంగా ఆయన ఆరోగ్యం పుంజుకుంది.
#FLASH M Karunanidhi passes away, Kauvery hospital releases statement pic.twitter.com/gUpZgYnPiY
— ANI (@ANI) August 7, 2018
ఇక కొన్నిరోజుల పాటు ధోకా లేదని భావించగా నిన్న రాత్రి మరలా ఆయన ఆరోగ్యం విషమించిది. ఈరోజు సాయంత్రం నాలుగన్నర సమయంలో బులెటిన్ విడుదల చేసినప్పుడు కూడా ఆయన వైద్యానికి స్పందించడంలేదని పేర్కొన్నారు. దీంతో ఆయనకీ ఏదో అయిందని ఆయన అభిమానులు అప్పటికే రోదించడం మొదలుపెట్టారు. అయితే కొద్ది సేపటి క్రితమే ఆరుగంటల పది నిముషాలకి ఆయన మృతి చెందారని అధికారికంగా ప్రకటించారు.