పచ్చిమిర్చి రోజూ వంటల్లో చేర్చితే.. ఎన్ని లాభాలో తెలుసా..?

పచ్చిమిర్చి లేకుండా మన భారతీయ వంటలు పూర్తి కావు. ఏవి వంటలకు కారాన్నిఅందించడమే కాదు.. మంచి రుచని కూడా ఇస్తుంది. పచ్చిమిర్చిలోని క్యాప్సైసిన్‌ అనే రసాయనం కారణంగా అది కారంగా ఉంటుంది. క్యాప్సైసిన్‌ దానికి మెరిసే ఆకుపచ్చ రంగు కూడా ఇస్తుంది. ఇది మన ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. మిర్చిలో B1, B2, B3, B6, B5, విటమిన్‌ ఏ, ప్రోటీన్లు, ఫైబర్, ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్‌, మెగ్నీషియం, పొటాషియం, కాపర్‌, జింక్, సోడియం, మాంగనీస్‌, విటమిన్‌ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

పచ్చిమిర్చిని మన ఆహారంలో చేర్చుకుంటే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.​పచ్చి మిరపకాయలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.పచ్చిమిర్చిలో ఉండే పోషకాలు ఆక్సికరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. మిరపకాయలలో పుష్కలంగా ఉండే క్యాప్సైసిన్ అనే రసాయనం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఐరన్‌ లోపం కారణంగా రక్తహీనత తలెత్తుతుంది. పచ్చి మిరపకాయల్లో ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఏ సమస్యని తగ్గించవచ్చు. . ఇంకా, పచ్చిమిర్చిలో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది, ఇది ఐరన్‌ శోషణను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.పచ్చి మిర్చిలోని బయోయాక్టివ్ సమ్మేళనాలు అధిక యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. పచ్చి మిర్చిలో విటమిన్‌ సి, విటమిన్‌ ఇ పుష్కలంగా ఉంటాయి. విటమిన్‌ సి కొల్లాజెన్‌ ఉత్పత్తికి సహాయపడుతుంది. విటమిన్‌ ఇ వృద్ధాప్య సంకేతాలును తగ్గిస్తుంది. పచ్చి మిర్చిలోని యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు చర్మానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. ఇంకా పచ్చిమిర్చిలోని యాంటీమైక్రోబయల్ గుణాలు చర్మాన్ని మొటిమలు, చర్మ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి.పచ్చి మిర్చిలో ఉండే.. క్యాప్సైసిన్ అనే క్రియాశీల సమ్మేళనంం జీవక్రియను పెంచుతుంది. క్యాప్సైసిన్‌ జీవక్రియను పెంచే వేడిని ఉత్పతి చేస్తుంది. . శరీరంలో పేరుకున్న కొవ్వును కరిగించడం లో సహాయపడుతుంది. దీంతో బరువు తగ్గుతారు.