ఫహద్ ఫాజిల్ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పుష్ప సినిమాల విలన్ పాత్రలో నటించిన మంచి పేరు ప్రాముఖ్యతలు సొంతం చేసుకున్నాడు. అతని తండ్రి డైరెక్టర్ కావడంతో చాలా సులభంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఫహద్ ఫాజిల్ అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి హీరోగా సినిమాల్లో నటించాడు. కానీ ఆ సినిమాలు పెద్దగా హిట్ అవ్వలేదు. దీంతో ఇతనికి చాలా నెగటివ్ కామెంట్స్ వచ్చాయి.
హీరోగా నువ్వు అసలు పనికిరావు అంటూ చాలామంది కామెంట్లు చేశారట. దింతో తనను సినిమాలకు గుడ్ బాయ్ చెప్పి అమెరికా లో చదువుకున్నాడు. దాదాపు 8 సంవత్సరాల తర్వాత సినిమాలకు మల్లి ఎంట్రీ ఇచ్చాడు తనను అవమానించిన వారితోనే ఇతను గొప్ప నటుడు అనే పేరుని తెచ్చుకున్నాడు. ఇక అప్పటినుంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇక “బెంగళూరు డేస్” సినిమాలో హీరోగా నటించాడు.
ఇక కొన్ని రోజులపాటు నజ్రియా ఫాజిల్ ని తన వెంట తిప్పుకొని చివరికి ఒకే చెప్పింది. ఆ తర్వాత వీరిద్దరూ పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఇక లాక్ డౌన్ సమయంలో చాలామంది హీరోలు సినిమాలలో నటించడానికి భయపడితే…ఫాజిల్ మాత్రం వరుస పెట్టి సినిమాలను చేసుకుంటూ వాటిని ఓటిటిలో రిలీజ్ చేశాడు. అలా చాలామందికి ఫహద్ ఫాజిల్ ఉపాధిని కల్పించాడు. అందరు హీరోల్లాగా అందం లేకపోయినప్పటికీ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.