కీర్తి వాళ్ళ అమ్మకు చిరుకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా…!

Megastar Chiranjeevi
Megastar Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక సాధారణ వ్యక్తిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఒకప్పుడు సినిమాల్లో ఒక చిన్న పాత్ర కోసం ఎంతో కష్టపడిన చిరంజీవి… తన నటనతో ప్రేక్షకులను మెప్పించి ఎంతో మందిని అలరించాడు.

ఇక చిరంజీవి కోసం స్టార్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు క్యూ కట్టేవారు.చిరంజీవి కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికి పెద్దగా గుర్తింపు రాలేదు.ఇక కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమాతో మెగాస్టార్ గుర్తింపు తెచ్చుకున్నారు.

“ఖైదీ” సినిమాతో చిరంజీవికి ఒక మంచి గుర్తింపుఅయితే వచ్చినప్పటికీ….. అంతకుముందే వచ్చిన “పున్నమినాగు” సినిమాలొ తన నటనతో ప్రేక్షకులను నడిపించాడు. “పున్నమినాగు” సినిమాలో తన నటనతో ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఎవరో కాదు ఒక స్టార్ హీరోయిన్ తల్లి. ఆమె మరెవరో కాదు కీర్తి సురేష్ వాళ్ళ అమ్మ.ఈ సినిమా 1980లో సూపర్ హిట్ అయింది. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి బోలా శంకర్ సినిమాతో మన ముందుకు వచ్చాడు.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కీర్తి సురేష్ మాట్లాడుతూ తన తల్లి మేనక గురించి చెప్పుకొచ్చారు. చిరంజీవి సినిమా సమయంలో తన కోస్టార్ తో ఎంత బాగా మెదులుతారో తన తల్లి తనకు చెప్పుకొచ్చిందని కీర్తి సురేష్ వెల్లడించింది. ఈ విషయాలు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.