మనిషి అనారోగ్యంతో బాధపడుతుంటే వైద్యుడు చికిత్స చేసి దాన్ని నయం చేయడమే కాదు.. కొన్నిసార్లు ప్రాణాలు పోయే విషమస్థితి నుంచి సర్వవిధాలుగా ప్రయత్నించి ఆ రోగికి ప్రాణం పోస్తాడు. అందుకే వైద్యున్ని వైద్యో నారాయణో హరి.. అనగా దేవుడుతో సమానంగా చూస్తారు. అలాంటి వైద్య వృత్తికే కళంకం తెచ్చాడు ఒక వైద్యుడు. డబ్బుమీద అత్యాశతో వైద్యవృత్తికే కళంకం తెచ్చిన ఆ డాక్టర్ పేరు మహేష్ ఆయన తాడేపల్లి గూడెంలోని మదర్ వన్నిని హాస్పిటల్ లో డాక్టర్. తాడేపల్లిగూడెం మండలం పెడతాడేపల్లి స్థానిక వీకర్స్ కాలనీకి చెందిన జుత్తిగ పార్థసారథి(55) అనే వ్యక్తి కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మదర్ వన్నిని ఆసుపత్రిలో చేరాడు. అయితే నిన్న సాయంత్రం ఐదు గంటలకు పార్థసారథికి కిడ్నీలో స్టోన్ ఆపరేషన్ జరగాల్సి ఉండగా వైద్యుడు మహేష్ ఆలస్యంగా 7.30 గంటలకు చేరుకొని ఆపరేషన్ మొదలు పెట్టాడు. మత్తు ఇచ్చి సగం ఆపరేషన్ అయ్యాక స్టోన్ కిడ్నీ కిందకు ఉందని ఈ ఆపరేషన్ ఆరోగ్యశ్రీలో కుదరదని తనకు డబ్బులిస్తే ఇప్పుడే స్టోన్‌ను తొలగిస్తానని లేకుంటే అలానే వదిలేస్తానని అనడంతో ఇప్పటికిప్పుడు తాము డబ్బులు ఇవ్వలేమనడంతో ఆపరేషన్ మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాడు.