బాబు నీ కామెంట్స్‌ మరీ విడ్డూరం

Sensational Comments On Babu Gogineni in Social Media

తెలుగు బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్న పార్టిసిపెంట్స్‌ ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రవర్తిస్తూ వస్తున్నారు. కౌషల్‌ పక్కా ప్రొఫెషనల్‌ గేమ్‌ ఆడుతుంటే మరి కొందరు మాత్రం గేమ్‌లో గేమ్‌ను ప్లాన్‌ చేస్తున్నారు. మరి కొందరు అసలు తాము గేమ్‌ ఆడేందుకు కాదు, మరేదో పనికి వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు. అయితే బాబు గోగినేని మాత్రం తాను ఈ గేమ్‌కు అయితే వచ్చాను కాని, తన స్థాయి ఇది కాదు అంటూ చెబుతున్నాడు. బాబు గోగినేని తాజాగా ఒక సందర్బంలో ఒక ఇంట్లో అంతా తెలుగు భాష మాట్లాడుతూ కలిసి ఉన్నంత మాత్రాన అంతా సమానం అవ్వరు. తాను తెలుగు మాట్లాడుతూ వీరితో కలిసి ఉన్నంత మాత్రాన వీరితో తాను సమానం అని ఎంత మాత్రం కాదు అంటూ తన తలబిరుసు చూపించాడు. తాను ఒక ఇంటర్నేషనల్‌ ఫిగర్‌ను అంటూ తనకు తాను కితాబు ఇచ్చుకున్నాడు.

గతంలో కూడా తనంతగా తెలివైన వారు ఇంట్లో లేరని, తాను మాత్రమే ఇంట్లో పెద్ద వ్యక్తిని, ఎక్కువ క్రేజ్‌ ఉన్న వ్యక్తిని అంటూ బాబు గోగినేని చెప్పుకొచ్చాడు. ఏ సమస్య అయినా తాను పరిష్కరిస్తాను అన్నట్లుగా చెప్పడం, ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో, దేన్ని లెక్క చేయని విధంగా మాట్లాడటం, రాజమౌళి వంటి దిగ్గజాలను సైతం తన తర్వాతే అంటూ చెప్పడం వంటివి చూస్తుంటే బాబు గోగినేని కాస్త అతి చేస్తుండని అనుకున్నారు. తాజాగా తాను ఒక ఇంటర్నేషనల్‌ ఫిగర్‌ను సెలబ్రెటినీ అంటూ చెప్పుకు రావడంతో అంతా కూడా అవాకవుతున్నారు. సోషల్‌ మీడియాలో బాబు గోగినేని వాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతుంది. టీవీ9 లేకుంటే నీవు ఎవరో జనాలకు తెలిసేది కాదు, ఇప్పుడు నువ్వు ఇంట్లో సభ్యులను అంటున్నావా అంటూ విమర్శలు చేస్తున్నారు. తనకు తానుగా ఇంటర్నేషనల్‌ సెలబ్రెటీ అంటూ చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.