దేశ వ్యాప్తంగా డాక్టర్ ల సమ్మె

Doctors strike throughout the country
డాక్టర్ల మీద దాడులను నిరసిస్తూ భారత వైద్యుల సంఘం ఈ రోజు 17న 24 గంటల బంద్‌ చేపట్టింది. 24 గంటల పాటు వైద్య సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. అత్యవసర చికిత్సలు మాత్రం కొనసాగుతాయని తెలిపింది. సాధారణ వైద్య సేవలకు మాత్రం ఆటకం కలగనుంది. సోమవారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు సాధారణ వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలో వైద్యుల మీద జరిగిన దాడిపై దేశవ్యాప్తంగా డాక్టర్లు నిరసన తెలిపారు. తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ వైద్యులు చేపట్టిన ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో 24 గంటల బంద్‌ను కొనసాగించాలని ఐఎంఏ నిర్ణయించింది. డాక్టర్ల మీద దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని, అందుకు తగ్గట్టుగా ఐపీసీలోని సెక్షన్లలో సవరణలు చేయాలని ఐఎంఏ డిమాండ్ చేస్తోంది. మరోవైపు బెంగాల్లో ఆందోళన చేస్తున్న వైద్యులను ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ చర్చలకు పిలిచారు. అయితే, ఆమె పిలిచిన చోటకు తాము వెళ్లకూడదని భావించిన వైద్యులు వెనక్కి తగ్గారు. చర్చలకు వెళ్తామని, అయితే మీడియా ముందే చర్చలు జరపాలని వారు డిమాండ్ చేశారు.