కాంగ్రెస్ అంటేనే.. తగువులు, కొట్లాటలు, ప్రజాస్వామ్యం ఎక్కువ అని అంటుంటారు. అటువంటిది క్లిష్ట సమయంలో పార్టీ నేతల మాటలు.. అగ్గికి ఆజ్యం పోసేలా ఉన్నాయి. ఒకరు యుద్ధం చేయాలంటే, మరొకరు శాంతి అంటున్నారు. ఇంకొకరు సింధూ జలాలు ఆపడం తప్పంటూ మాట్లాడుతున్నారు. నేతల తలోమాట చూసి.. రాహుల్ గాంధీకి చిర్రెత్తుకొచ్చింది. పహాల్గామ్ దాడిపై పార్టీ లైన్ దాటొద్దని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. దేశ భద్రతకు సంబంధించిన అంశంలో సొంత వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశాలిచ్చారు. తాను, ఖర్గే చెప్పిందే ఫైనల్ అని.. ఉగ్రదాడిపై ఎవ్వరూ సొంత అభిప్రాయాలు చెప్పొద్దని సూచించారు.





