సూపర్‌మూన్‌కు సమయం దగ్గరపడింది. రేపటి నుంచి ఓ వారం రోజుల పాటు చందమామ భారీ సైజులో కనిపించనుంది. దీన్నే సూపర్ ఫ్లవర్ మూన్ అని కూడా అంటున్నారు. ఈ ఏడాది చివరి సూపర్ మూన్ ఇదే కావడంతో దీన్ని ఫ్లవర్ మూన్ అని కూడా పిలుస్తున్నారు. అయితే పున్నమి రోజున సాధారణ సైజు కన్నా.. కాస్త పెద్దగా చంద్రుడు దర్శనమిస్తాడు. దాన్నే మనం సూపర్‌మూన్ అంటాం.
అయితే వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్‌లో కనిపించిన పింక్ మూన్.. సూపర్‌మూన్ కన్నా పెద్దసైజులో దర్శనమిచ్చింది. కానీ ఈరోజు నుంచి కనిపించే చంద్రుడు కూడా అత్యంత వైభవంగా దర్శనమిస్తాడని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇప్పుడు వచ్చే సూపర్‌మూన్‌ను అమెరికన్లు ఫ్లవర్ మూన్ అని పిలుస్తారు. ఎందుకంటే ఈ కాలంలో ఎక్కువ శాతం పువ్వులు వికసిస్తాయి. దీన్నే కార్న్ ప్లాంటింగ్, మిల్క్ మూన్ అని కూడా పిలుస్తారని నాసా చెప్పింది. కాగా శుక్రవారం వచ్చే పున్నమిని వేసాక పున్నమి అని కూడా అంటారు.
బుద్ద జయంతిగా కూడా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. భూమికి సమీపంగా వచ్చి.. పెద్దగా, మరింత దేదీప్యమానంగా చంద్రుడు వెలిగితే.. దాన్నే మనం సూపర్‌మూన్ అంటాం. మిస్ కాకండి మరేయ్.