ఫోన్లో అతిగా మాట్లాడేవారికి తలలో కొమ్ములు మొలిసే ప్రమాదం ఉందని ఒక పరిశోధన తేల్చింది. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు ఓ వ్యక్తి తలలోని పుర్రెకు కొమ్ములు మొలవడాన్ని గుర్తించారు. ఇందుకు అతడు ఫోన్ అతిగా మాట్లాడటమే కారణమని తెలుసుకున్నారు. ‘‘ఫోన్ మాట్లాడేప్పుడు మనకు తెలియకుండానే వెనక్కి లేదా పక్కకు వాలిపోయి మాట్లాడతాం. దీనివల్ల బరువంతా తలపై పడి ligaments లో ఎముక మొలుస్తుంది. ఇది సుమారు పక్షి ముక్కుంత ఉంటుందని చిరోప్రాక్టర్ డెవిడ్ సహాహర్ ‘వాషింగ్‌టన్ పోస్ట్’ పత్రికకు తెలిపారు. దీని పొడవు 10 మిల్లీమీటర్లు మాత్రమే ఉంటుందని, తల వెనుక కింది భాగంలో ఈ కొమ్ములు మొలుస్తాయని అన్నారు. సహాహర్ అతని సహచరులు ఈ పరిశోధనలపై రెండు పరిశోధనలను చేశారు. దీనిపై ఆన్‌లైన్‌లో భారీ చర్చలే జరుగుతున్నాయి. చేతితో పట్టుకునే స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్‌లను విస్తృతంగా వాడటం వల్ల ఈ సమస్య ఏర్పడుతుందని, నిరంతరం ఒకే భంగిమకు అలవాటుపడే వారిలో కొమ్ములు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. చిన్నతనం నుంచి ఫొన్ మాట్లాడే అలవాటు ఉన్నవారికి మరింత వేగంగా ఈ సమస్య ఏర్పడవచ్చని తెలిపారు. ఈ కొమ్ముల వల్ల వారికి వెంటనే ప్రమాదం లేకున్నా తల లేదా మెడ ఆకృతి కోల్పోవచ్చని తెలిపారు. సహాహర్ టీమ్ నిర్వహించిన అధ్యయనంలో 41 శాతం యువతలో ఈ సమస్య ఉన్నట్లు గుర్తించారు. బాధితుల్లో అత్యధికులు పురుషులే ఉన్నారు. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఫోన్ మాట్లాడేప్పుడు తమ తల, మెడ భంగిమలు సక్రమంగా ఉంచితే ఈ సమస్యను ఆదిలోనే అంతం చేయొచ్చని అంటున్నారు. కాబట్టి మీరు కూడా ఈ జాగ్రత్తలు పాటించండి. ఈ విషయాన్ని మీ బంధుమిత్రులకి షేర్ చేసుకుని వారిని కూడా అప్రమత్తం చేయండి.