ఇక నుంచి డబుల్ టోల్.. అది లేకుంటే అంతే..

జాతీయ రహదారులపై డబుల్‌ టోల్‌ ఫీజు వసూలు చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అందుకు కారణం లేకపోలేదు లేండి. అదేమంటే ఫాస్టాగ్‌ లేని వాహనాలకు మాత్రమే అలా వసూలు చేయనున్నరు. అందుకు సంబంధించి రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వశాఖ ఆదివారం ఆదేశాలు జారీచేసింది. జాతీయ రహదారులపై తిరిగే వాహనాలకు గతేడాది డిసెంబర్‌ 15నుంచి ఫాస్టాగ్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. 2020 మేవరకు దేశవ్యాప్తంగా 1.68 కోట్ల ఫాస్టాగ్‌లను ప్రభుత్వం మంజూరు చేసింది.
అయితే ఇంకా చాలావరకు వాహనాలు ఫాస్టాగ్‌ లేకుండానే హైవేలపై తిరుగుతున్నాయి. ఇకపై వాటికి డబుల్‌ టోల్‌ ఫీజు వసూలు చేయనుంది కేంద్రం. ఫాస్టాగ్‌ లేకున్నా.. లేదా సరిగా పనిచేయని ఫాస్టాగ్‌ ఉన్నా ఆ వాహనాలు టోల్‌ఫ్లాజా వద్ద ఫాస్టాగ్‌ లేన్‌లోకి ప్రవేశించ కూడాదని స్పష్టం చేసింది. ఒకవేళ ఆ వాహనాలు ఫాస్టాగ్‌ లేన్‌లోకి వస్తే ఆ వాహనానికి టోల్‌ ఫీజును రెండురెట్లు ఎక్కువగా వసూలు చేస్తామని కూడా వివరించింది.