Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఓ ఉత్పత్తి వినియోగాదారులకు చేరే ప్రధానమైన వారధి ఎడ్వర్ టైజ్ మెంట్ . ఓ ప్రకటన వేల కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థ భవితవ్యాన్ని నిర్దేశిస్తుంది. ఒక్క యాడ్ క్లిక్కయితే దాని ఆధారంగా ఆ ఉత్పత్తి మార్కెట్ లో దూసుకుపోయిన సందర్భాలు ఎన్నో. మార్కెట్ లోని చాలా ఉత్పత్తులు యాడ్స్ ద్వారానే మనుగడ సాగిస్తున్నాయనడంలో సందేహం లేదు. అందుకే ఒక్కో యాడ్ తయారీకి లక్షలు ఖర్చుచేస్తుంటారు. ఎంతో జాగ్రత్తగా ఆలోచించి యాడ్ రూపకల్పన చేస్తారు. కానీ ఒక్కోసారి ప్రకటనల్లో తప్పులు దొర్లిపోయి తీవ్ర వివాదానికి దారితీస్తుంటాయి. ప్రకటనల వెనక ఉన్న ఉద్దేశాలపై దుమారం చెలరేగుతుంది. అంతర్జాతీయ కంపెనీల యాడ్ లు ఇలా వివాదాస్పదమైన ఘటనలు గతంలోనూ చాలానే ఉన్నాయి. తాజాగా సబ్బు, షాంపూల తయారీ సంస్థ డవ్ రూపొందించిన ఓ ప్రకటనపైనా, ఆసంస్థ పైనా సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బాడీ వాష్ ప్రోడక్ట్ కోసం డవ్ ఈ ప్రకటన తయారుచేసింది.
ఓ నల్ల జాతీయురాలు తన షర్ట్ తీసేయగానే తెల్లటి మహిళగా మారిపోతున్నట్టు ఈ యాడ్ ఉంది. ప్రకటనలో అమ్మాయిల పక్కన డవ్ బాటిల్ కనిపిస్తుంటుంది. ఫేస్ బుక్ పేజీలో డ్ పోస్ట్ చేసిన ఈ యాడ్ పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నల్లజాతీయరాలు తెల్లటి అమ్మాయిగా మారినట్టు చూపించడం జాత్యహంకారమే అని మండిపడుతున్నారు. శుభ్రమైన శరీరం అంటే తెల్లటి శరీరం కాదని అట్లాంటాకు చెందిన ఓ ప్రొఫెసర్ వ్యాఖ్యానించారు. నల్ల రంగు శరీరం చెత్త, తెల్ల రంగు శరీరం శుభ్రమైనది అన్నట్టుగా ఈ యాడ్ ఉందని విమర్శించారు. చాలా కాలంగా తాను డవ్ ఉత్పత్తులను వాడుతున్నానని, ఇకపై అవి వాడనని ఆయన మండిపడ్డారు.
🚨🚨🚨LETS PLAY A GAME all my PEOPLE OF COLOR …. share with your children, baby cousins, and or little sister or brother…. don't tell them anything only that this is an ad (video) about soap …..ask them what is the black girl doing and what does this video mean to them and write their responses below 👀👀👀👀 (you will be surprised) #doveAD 🚨🚨🚨 #subliminalmessagesarereal (these are the kind of messages and ads that manipulate a young persons mind)
تم نشره بواسطة Naythemua في 8 أكتوبر، 2017