ఎయిర్‌పోర్టుపై రెండో దాడి

ఎయిర్‌పోర్టుపై రెండో దాడి

సౌదీ అరేబియాలో డ్రోన్‌ దాడి జరిగింది. నైరుతి సౌదీ అరేబియాలోని అభా ఎయిర్‌పోర్టు లక్ష్యంగాపై దాడిలో 8 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిలో ఓ విమానం ధ్వంసం అయినట్లు సౌదీ మీడియా పేర్కొంది.

గడిచిన 24 గంటల్లో స్థానిక అభా ఎయిర్‌పోర్టుపై ఇది రెండో దాడిగా తెలుస్తోంది. ఈ డ్రోన్‌ దాడికి సంబంధించి బాధ్యత వహిస్తూ ఎవరూ ఎటువంటి ప్రకటన జారీ చేయలేదు.