నీరుగారిన డ్రగ్స్ కేసు

drug case for not impossible in people's

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ప్రతి కేసునూ హడావిడి చేయడం, ఈ దశలో ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ను తెర ముందు పెట్టడం, కథ నడిపించడం రాజకీయ సమీకరణాలకు అడ్డం అనుకుంటే.. వెంటనే అటకెక్కించేయడం ఇదీ తెలంగాణ ప్రభుత్వంలో జరుగుతున్న పని. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన డ్రగ్స్ కేసులో కూడా కేవలం పన్నెండు మంది సెలబ్రిటీలకు తాఖీదులు ఇచ్చి.. సిట్ ఆఫీస్ లో విచారణ జరిపిన అధికారులు.. ఇంకా బడాబాబులున్నారని, వారిని గోప్యంగా విచారిస్తామని చెబుతున్నారు. అంటే ఆ పన్నెండు మందే బలిపశువులా.

మన చట్టం, న్యాయం ప్రకారం అందరూ సమానమే. అయితే పోలీసుల దృష్టిలో ఎప్పుడూ పెద్దవాళ్లు ఎక్కువ సమానం. సామాన్యులు సమానం కంటే తక్కువ. ఇదే సూత్రాన్ని డ్రగ్స్ కేసుకు అన్వయిస్తున్నారు. నిజానికి డ్రగ్స్ తో అన్ని రంగాలకు లింకుంది. కానీ సినీ ఇండస్ట్రీని ఉద్దేశపూర్వకంగా బద్నాం చేశారన్న వాదనకు ఇప్పుడు అధికారుల ప్రకటన సాక్ష్యంలా మారింది. ఇప్పటిదాకా వచ్చిన పన్నెండు మంది బలిపశువుల్లో నిజంగా డ్రగ్స్ తీసుకునేవాళ్లున్నా.. జనం మాత్రం నమ్మే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.

ఇవాళ తనీష్ ను విచారిస్తున్న అధికారులు… ఆగస్టు 2 వరకే డేట్స్ ఇచ్చారు. తర్వాత సెకండ్ లిస్ట్ ఉంటుందని ముందు ప్రకటించినా.. ఇప్పుడు గోప్యత పేరుతో పెద్దల్ని దాచేస్తున్నారు. అంటే ప్రముఖుల ఇళ్లకు వెళ్లి విచారించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సిట్ విచారణ తీరు తేడాగా ఉందనడానికి ఇదే నిదర్శనం. నిందితులైనా, అనుమానితులైనా ప్రశ్నించేటప్పుడు ఒకేలా వ్యవహరించాలి. కానీ వారిని ఆఫీస్ కు పిలిచి ఎంక్వైరీ చేసి, వీరిని మాత్రం ఇళ్లకు వెళ్లి విచారిస్తే.. అప్పుడు హైకోర్టు కూడా సిట్ కు అక్షింతలు వేసే అవకాశాలున్నాయి.

మరిన్ని వార్తలు: