కేవీపీ ముందే ఆ స్వామీజీ కాళ్ళ మీద పడ్డ జగన్.

Ys jagan in narendra chowdary daughter wedding

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2019 ఎన్నికల్లో ఏ ఫలితం వస్తుందో ఏమో గానీ ఓటమి అనే మాట వినాల్సి వస్తుందేమో అని భయంతో గజగజలాడిపోతున్నాడు వైసీపీ అధినేత జగన్. అందుకే ఆ ఎన్నికల గండం నుంచి ఎవరు బయటపడేస్తారా అని వేయికళ్లతో ఎదురు చూస్తున్నాడు. ఇందుకోసం భారీ ఆఫర్ ఇచ్చి మరీ తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్ వ్యూహాల మీద నమ్మకం కుదిరిందో లేదో గానీ కాస్త పెద్దవాళ్ళు కనడగానే ఆయన కాళ్ళ మీద పడిపోతున్నారు. ఒకప్పుడు జగన్ వైఖరికి ఇది పూర్తి భిన్నం. ఇటీవల రాష్ట్రపతిగా ఎన్నికైన కోవిద్ హైదరాబాద్ వచ్చినప్పుడు జగన్ పాదాభివందనం చేయడం చూసాం. ఇక ఇప్పుడు చంద్రబాబు అంటే పడని ఇంకో స్వామీజీకి పాదాభివందనం చేసాడు జగన్.

ఎన్ టీవీ నరేంద్రచౌదరి కుమార్తె వివాహానికి వెళ్లారు వైసీపీ అధినేత జగన్. అక్కడ ఆయనకి శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ఎదురు అయ్యారు. ఆ పక్కనే వై.ఎస్ ఆత్మ గా చెప్పుకునే కేవీపీ, మహా సిమెంట్స్ అధినేత, ప్రస్తుతం తెలంగాణ సీఎం కెసిఆర్ కి సన్నిహితుడు అయిన జూపల్లి రామేశ్వర్ వున్నారు. వారి సమక్షంలో ముందుగా చినజీయర్ స్వామికి నమస్కరించిన జగన్ ఆ తరువాత ఏమనుకున్నారో గానీ పాదాభివందనం చేశారు. స్వామిజీ కూడా ఆయనకి ఆశీర్వచనాలు ఇచ్చారు. తిరుమల ఆలయ వ్యవహారాలు సహా వివిధ అంశాల్లో సీఎం చంద్రబాబుతో చినజీయర్ బిభేదించిన విషయం అందరికీ తెలిసిందే. ఇక విశాఖ శారద పీఠానికి చెందిన స్వరూపానంద కూడా బాబుని తప్పుబట్టి ఎప్పుడెప్పుడు జగన్ ని సీఎం చేద్దామా అని ఎదురు చూస్తున్నట్టు వ్యవహరిస్తున్నారు.

మరిన్ని వార్తలు:

జగన్ తో కలిసి పవన్ పనిచేయగలడా..?

పవన్ కులం కోసం పోరాడరట