ప్రపంచమంతా కరోనా మహమ్మారితో తల్లడిల్లిపోతుంది. ఈ సయమంలో దేశమంతా లాక్ డౌన్ లో కొనసాగుతుంది. అంతేకాకుండా కరోనా అనుమానితులను ఎక్కడికక్కడ క్వారంటైన్స్ లో ఉంచుతూ వారి బాగోగులను చూసుకుంటుంది ప్రభుత్వం. ఇలాంటి సమయంలో షాకింగ్ నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఏకంగా కరోనా ఐసోలేషన్ వార్డునే మందుబాబులు బార్‌గా మార్చేశారు. కరోనా లక్షణాలతో క్వారంటైన్‌లో ఉన్న కొందరు వార్డులోనే మద్యం తాగి హల్‌చల్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వీడియో బయటికి రావడంతో విషయం పొక్కింది.
అయితే కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం తీవ్రమైన చర్యలు తీసుకుంటుంది. ప్రజలెవరూ రోడ్లపైకి రానీయకుండా ఆదేశాలు జారీ చేసింది. దీంతో రోడ్లపైకి రావాలంటేనే జనం భయపడుతున్నారు.. అలాంటిది ఓ చోట మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఏకంగా ఐసోలేషన్ వార్డునే బార్‌గా మార్చేశారు కొందరు అనుమానితులు. కరోనా లక్షణాలతో తాత్కాలిక ఐసోలేషన్ కేంద్రంలో చేరిన కొందరు తమ పలుకుబడి ఉపయోగించి అక్కడికే మద్యం తెప్పించుకొని తాగి ఎంజాయ్ చేశారు. మందుబాబుల ఆగడాల వీడియోలు వైరల్ కావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఒడిశాలో వెలుగుచూసింది.
కాగా ఒడిశాలోని నువపాద పంచాయతీలో ప్రభుత్వం ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. పలువురు గ్రామస్థులు కూడా వైరస్ లక్షణాలతో చికిత్స కోసం క్వారంటైన్‌లో చేరారు. వారిలో పంచాయతీ సమితి సభ్యుడు ఉత్తమ్ తరాయ్ అనే అతని కూడా ఉన్నారు. దీంతో ఏకంగా ఐసోలేషన్ వార్డులోనే దుకాణం పెట్టేశారు. పంచాయతీ సమితి సభ్యుడు ఉత్తమ్ తరెయ్, కాలు జీనా, ధీర పలెయ్ అనే మరో ఇద్దరితో కలసి మద్యం తాగి హల్‌చల్ చేశారు. దాన్నంతా వీడియో రికార్డ్ చేసిన ఓ వ్యక్తి అది సోషల్ మీడియాలోకి ఎక్కించేశాడు. వెంటనే సీరియస్ అయిన ఉన్నతాధికారులు తమ విధుల్లో నిర్లక్ష్య వహించిన స్థానిక పంచాయతీ అధికారిని సస్పెండ్ చేశారు. ఐసోలేషన్ లో మద్యం తాగిన ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని అరెస్టు చేశారు.