ఉత్తరప్రదేశ్ లో ఘోరం జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఓ తండ్రి క్రూర మృగంలా మారిపోయాడు. మత్తులో అతనేం చేస్తున్నాడో ఎలా ప్రవర్తిస్తున్నాడో తెలియకుండా ఘోరం చేసేశాడు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఇద్దరు ఆడబిడ్డలను కాటేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది.
అయితే అక్కడ బనేతు గ్రామానికి చెందిన జైనుల్ అబ్దీన్ రెండేండ్ల క్రితం తన భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. అప్పటికే జైనుల్కు ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు. ఈ ఇద్దరు కూడా తండ్రి వద్దే ఉంటున్నారు. అయితే.. తాజాగా తండ్రి నిత్యం తాగుతూ పిల్లలను వేధించసాగాడు. సోమవారం ఇంటి బయట పిల్లలు ఆడుకుంటుండగా.. ఆడ వద్దని జైనుల్ ఆపేందుకు పలుమార్లు చెప్పాడు. ఎంతకీ ఆయన మాటని వినని పిల్లలపై మద్యం మత్తులో ఉన్న తండ్రి.. ఆ చిన్నారులపై ఇటుకతో దాడి చేసి చంపేశాడు. స్థానికులు తెల్పిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.
హత్యకు గురైన పిల్లల వయసు ఒకరికి ఐదేండ్లు ఉన్నాయి. మరొకరికి రెండున్నరేండ్లుగా ఉన్నారు. అయితే జైనుల్ మరో పెళ్లి చేసుకొనేందుకు రెడీ అయినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అందుకే ఇలాంటి ఘటనకు తండ్రి ఒడిగట్టాడా అనే కోణంలో కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మరి ఈ కేసులో తవ్వే కొద్ది మరిన్న నిజాలు వెలుగు చూస్తుండటం విశేషం.