కనకదుర్గమ్మ ఆలయంలో గత ఆదివారం నాడు రూ. 18 వేల విలువైన ఆషాఢ మాస సారెను కొందరు భక్తులు అమ్మవారికి బహూకరించగా, దాని విలువను తెలుసుకున్న సూర్యలత, ఆ చీరను తీసుకుని వెళ్లినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కనకదుర్గమ్మకు భక్తులు సమర్పించిన సదరు విలువైన చీర మాయం వెనుక పాలకమండలి సభ్యురాలు కోడెల సూర్యలతే ప్రధాన కారణమని అధికారులు నిర్ధారణకు వచ్చారు. మరోపక్క సీసీటీవీ ఫుటేజ్ సైతం ఇదే విషయాన్ని ధ్రువీకరించడంతో గురువారం రాత్రి సూర్యలతను పాలకమండలి నుంచి తొలగిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
తమ శాఖాపరమైన విచారణలో సూర్యలతపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలాయని, అందువల్ల తాము ఆమెను తొలగించామని దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి మన్మోహన్ సింగ్ వెల్లడించారు. ముందు తానేమీ భక్తులు పెట్టిన చీరను తీసుకెళ్లలేదని, తనకు యాదవ సంఘం వారు బహుకరించిన ఇచ్చిన కాటన్ చీరను మాత్రమే తీసుకెళ్లానని ఆమె వాదించినప్పటికీ, సీసీటీవీ కెమెరాలు అమ్మవారి ముందున్న చీర ఎలా మాయం అయిందో కళ్లకు కట్టినట్టు చూపాయి.అయితే మరో దరిద్రం ఏమిటంటే సదరు సూర్యలతను వెనకేసుకొస్తూ వారి కుల సంఘం వారు ఇచ్చిన స్టేట్మెంట్. అఖిల భారత యాదవ సంఘం స్టేట్మెంట్ ప్రకారం ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నా కొన్ని సంఘటనలు మాత్రమే బుతాద్ధంలో చూస్తున్నారట.
అదే విధంగా కొంత మంది సూర్యాలత గారిని టార్గెట్ చేసి నిందలు మోపుతున్నారని , విచారణ ను ప్రభుత్వం పునరుద్ధరించాలని, అసలు బీసీలు అంటే ప్రభుత్వంకి లెక్కలేని విధంగా ప్రవర్తిస్తున్నారని దుర్గగుడి లో వేసిన విచారణ రిపోర్ట్ ను బైటపెట్టాలని వారు డిమాండ్ చేశారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమన్నా ఉందా ? మన కులపొళ్లు అయితే దొంగలు దొరలువుతరా ? ఇదేమి దరిద్రం. మొన్నటికి మొన్న ఏపీ రాజధాని మీద విషం కక్కుతున్న ఐవీయార్ ని విధుల నుండి తొలగిస్తే ఆయన కులమంటూ కొందరు రోడ్డెక్కారు. నిజానికి ఆమెను విధుల నుండి తప్పిస్తే అది తెలుగుదేశానికే మచ్చ, ఎందుకంటే ఆమె తెలుగుదేశం నాయకురాలు కాబట్టి. కానీ ఎవరు తప్పు చేసినా క్రమశిక్షణ చర్యలు తప్పకతీసుకునే పార్టీగా తెలుగుదేశం ఇక్కడ కూడా హుందాగా ప్రవర్తించిందే తప్ప ఎవరినీ రక్షించడానికి ప్రయత్నించలేదు. అంటే ఈ విధంగా కులం సపోర్ట్ ఉంటె దొంగతనాలు, మాన భంగాలు చేసినా ఏమవదేమో ?
వశిష్ట