Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
E-Mail War Between YCP Party And TDP Party
ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ మెయిల్స్ రాజకీయం మొదలైంది. మొన్నటికి మొన్న బాబు అమెరికా టూర్లో వైసీపీ మెయిల్స్ కలకలం రేపితే.. ఇప్పుడు అమరావతికి వ్యతిరేకంగా రైతుల పేరుతో ప్రపంచ బ్యాంక్ కు వెళ్లిన మెయిల్స్ రచ్చ మొదలైంది. రైతుల పేరుతో వైసీపీ నేతలే ఇలా చేశారని టీడీపీ నేతలు అంటుంటే.. అంత ఖర్మ తమకు పట్టలేదంటున్నారు వైసీపీ నేతలు.
కానీ మెయిల్స్ మాత్రం ఉద్దేశపూర్వకంగా వెళ్లాయంటున్నారు తెలుగు తమ్ముళ్లు. రాజధాని ప్రాంత రైతులంతా ఇష్టపూర్వకంగా తమ పొలాలిచ్చారని, అలాంటి వాళ్లు అభివృద్ధిని అడ్డుకుంటూ మెయిల్స్ పెట్టారనేది వారి వాదన. కానీ వైసీపీ నేతలు మాత్రం తాము అవినీతికే అడ్డు కానీ, అభివృద్ధికి కాదని తేల్చిచెబుతున్నారు. అయితే మెయిల్స్ ఎవరు పెట్టారో త్వరలోనే తేలుతుందంటున్నాయి ఏపీ ప్రభుత్వ వర్గాలు.
కానీ వైసీపీ ట్రాక్ రికార్డ్ ఇలాగే ఉందంటున్నాయి టీడీపీ వర్గాలు. కోపం ఉంటే ప్రభుత్వంపై విమర్శలు చేయాలీ కానీ.. వ్యవస్థల్ని దెబ్బతీసే నీచ రాజకీయాలు చేయొద్దంటున్నారు టీడీపీ నేతలు. అటు వైసీపీలో కూడా కలవరం మొదలైంది. మొన్న బాబు అమెరికా టూర్లో ఇలాగే బుకాయించినా.. చివరకు రవికిరణ్ వైసీపీ కిందే పనిచేస్తున్నారని తేలింది. ఇప్పుడు కూడా అలాంటిది బయటపడితే పార్టీ పుట్టి మునుగుతుందని నేతలు భయపడుతున్నారు.
మరిన్ని వార్తలు: