మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఈగల్. ఈ మూవీ థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించింది. ఇటీవల ఓటిటి లోకి కూడా అరంగేట్రం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అమేజాన్ ప్రైమ్ వీడియో మరియు ఈటీవీ విన్ లో ఈ మూవీ డిజిటల్ గా రిలీజ్ అయ్యి డీసెంట్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది.
ఈ మూవీ ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ యొక్క శాటిలైట్ రైట్స్ ని ఈటీవీ చానెల్ సొంతం చేసుకుంది. త్వరలో టీవీ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రానున్నది . కావ్య థాపర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల తదితరులు కీలక పాత్రల్లో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభోట్ల సంయుక్తం గా నిర్మించిన ఈ మూవీ కి దావ్ జంద్ సంగీతం అందించారు.