Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల గంట మోగింది. మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు నిర్వహించబోయే ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్, షెడ్యూల్ ను ఎన్నికల సంఘం ఈ ఉదయం విడుదల చేసింది. 4.96 కోట్ల మంది ఓటర్లు వున్న కర్ణాటకలో మే 12 న పోలింగ్ జరుగుతుంది. ఆపై మూడు రోజులకి అంటే మే 15 న ఫలితాలు వస్తాయి. ఒక్కో నియోజకవర్గానికి ఎన్నికల వ్యయ పరిమితి 28 లక్షలు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం ద్వారా దక్షిణాదిలో కూడా పాగా వేయాలని బీజేపీ కలలు కంటోంది. అయితే ప్రస్తుతం కర్ణాటక రాజకీయ వాతావరణం చూస్తే ఆ కలలు కల్లలు కావడం ఖాయం అనిపిస్తోంది. సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్ ఇంకోసారి జయభేరి మోగించవచ్చని వివిధ సర్వేల్లో వెల్లడి అవుతూ వస్తోంది. అయితే JDs తో జట్టు కట్టడంతో కాంగ్రెస్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. అయితే జేడీఎస్ అందుకు అంగీకరించినా రాజకీయాల్లో వన్ ప్లస్ వన్ టూ అని చెప్పలేం. అందుకే మిగిలిన రాజకీయ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి, సంక్షేమ పధకాలను నమ్ముకుని సిద్ధరామయ్య యుద్ధం చేస్తున్నారు. కర్ణాటక ఓటర్లు ఎవరిని కరుణిస్తారో మే 15 న తేలుతుంది.