తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో 70.66 శాతం పోలింగ్ నమోదైంది. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 9.30 గం. వరకూ ఓటింగ్ కొనసాగింది. అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 90.03 శాతం పోలింగ్ నమోదు కాగా.. అత్యల్పంగా హైదరాబాద్ జిల్లాలో 46.56 శాతం పోలింగ్ నమోదైంది. మునుగోడు నియోజకవర్గంలో అత్యధికంగా 91.51 శాతం ఓటింగ్ జరిగింది. యాకుత్‌పుర నియోజకవర్గంలో అత్యల్పంగా 39.69 శాతం ప్రజలు ఓటింగ్‌లో పాల్గొన్నారు. స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ఎల్లుండి తెలంగాణ సహా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.
జిల్లాల వారీగా పోలింగ్ శాతం
-> మెదక్ జిల్లాలో 86.69 శాతం పోలింగ్ నమోదు
-> జనగామ జిల్లాలో 85.74 శాతం పోలింగ్ నమోదు
-> నల్గొండ జిల్లాలో 85.49 శాతం పోలింగ్ నమోదు
-> సూర్యాపేట జిల్లాలో 84.83 శాతం పోలింగ్ నమోదు
-> మహబూబాబాద్ జిల్లాలో 83.70 శాతం పోలింగ్ నమోదు
-> ఖమ్మం జిల్లాలో 83.28 శాతం పోలింగ్ నమోదు
-> ములుగు జిల్లాలో 82.09 శాతం పోలింగ్ నమోదు
-> భూపాలపల్లి జిల్లాలో 81.20 శాతం పోలింగ్ నమోదు
-> గద్వాల జిల్లాలో 81.16 శాతం పోలింగ్ నమోదు
-> ఆసిఫాబాద్ జిల్లాలో 80.82 శాతం పోలింగ్ నమోదు
-> ఆదిలాబాద్ జిల్లాలో 79.86 శాతం పోలింగ్ నమోదు
-> సిద్దిపేట జిల్లాలో 79.84 శాతం పోలింగ్ నమోదు
-> కామారెడ్డి జిల్లాలో 79.59 శాతం పోలింగ్ నమోదు
-> నాగర్‌కర్నూల్ జిల్లాలో 79.46 శాతం పోలింగ్ నమోదు
-> భద్రాద్రి జిల్లాలో 78.65 శాతం పోలింగ్ నమోదు
-> నిర్మల్ జిల్లాలో 78.24 శాతం పోలింగ్ నమోదు
-> వరంగల్ జిల్లాలో 78.06 శాతం పోలింగ్ నమోదు
-> మహబూబ్‌నగర్ జిల్లాలో 77.72 శాతం పోలింగ్ నమోదు
-> వనపర్తి జిల్లాలో 77.64 శాతం పోలింగ్ నమోదు
-> నారాయణపేట జిల్లాలో 76.74 శాతం పోలింగ్ నమోదు
-> పెద్దపల్లి జిల్లాలో 76.57 శాతం పోలింగ్ నమోదు
-> వికారాబాద్ జిల్లాలో 76.47 శాతం పోలింగ్ నమోదు
-> సంగారెడ్డి జిల్లాలో 76.35 శాతం పోలింగ్ నమోదు
-> సిరిసిల్ల జిల్లాలో 76.12 శాతం పోలింగ్ నమోదు
-> జగిత్యాల జిల్లాలో 76.10 శాతం పోలింగ్ నమోదు
-> మంచిర్యాల జిల్లాలో 75.59 శాతం పోలింగ్ నమోదు
-> కరీంనగర్ జిల్లాలో 74.61 శాతం పోలింగ్ నమోదు
-> నిజామాబాద్ జిల్లాలో 73.72 శాతం పోలింగ్ నమోదు
-> హనుమకొండ జిల్లాలో 66.38 శాతం పోలింగ్ నమోదు
-> మేడ్చల్ జిల్లాలో 56 శాతం పోలింగ్ నమోదు
-> రంగారెడ్డి జిల్లాలో 59.94 శాతం పోలింగ్ నమోదు