మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు విజయశాంతి. నిన్ననే ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు విజయశాంతి. అయితే… నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతికి కీలక పదవి ఇచ్చారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార, ప్లానింగ్ కమిటీ నియామకం అయింది. ఈ తరుణంలోనే… ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీలో విజయశాంతికి చోటు కల్పించారు. ప్రచార కమిటీ చీఫ్ కో ఆర్డినేటర్‌గా, ప్లానింగ్ కమిటీ కన్వీనర్‌గా విజయశాంతికి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. 15 మందికి కన్వీనర్ పోస్టులు ఇచ్చారు. మహేశ్వరం టికెట్ ఆశించిన బడంగ్పేట్ మేయర్ పారిజాతకి కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ పోస్ట్ ఇచ్చింది .
ఇది ఇలా ఉండగా.. కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి నిజామాబాద్ ఎంపీ ధర్మపూరి అరవింద్ పై సీరియస్ అయ్యారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపూరి అరవింద్ నన్ను ఎన్నో మాటలు అన్నారు తాజాగా ఒక ఛానల్ తో మాట్లాడుతూ… నిజామాబాద్ ఎంపీ ధర్మపూరి అరవింద్ నన్ను విమర్శించారని గుర్తు చేశారు. వ్యక్తులను విమర్శించే సంస్కారం మాకు అటల్ జీ అద్వానీ జీ, నాటి బీజేపీ నేర్పలేదని చురకలు అంటించారు. BRS, బీజేపీ ఒకటేనని ఇయ్యాల తెలంగాణ సమాజం అంటున్నదని కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి సీరియస్ అయ్యారు.