Election Updates: Breaking: “అభయ హస్తం” పేరుతో కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల

Election Updates: Breaking: Release of Congress Manifesto titled “Abhaya Hastam”.
Election Updates: Breaking: Release of Congress Manifesto titled “Abhaya Hastam”.

గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల అయింది. గాంధీ భవన్‌లో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే చేతుల మీదుగా కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల అయింది. అభయ హస్తం పేరుతో మేనిఫెస్టోను ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే రిలీజ్ చేశారు.

ఇవాళ 42 పేజీల్లో, 62 ప్రధాన అంశాలతో అభయహస్తం మేనిఫెస్టో రూపొందించిన కాంగ్రెస్‌ పార్టీ గాంధీ భవన్‌లో విడుదల అయింది. ఇక కాంగ్రెస్ మేనిఫెస్టో పై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ రిలీజ్ చేసిన కాంగ్రెస్ మేనిఫెస్టో తమకు బైబిల్, ఖురాన్ మరియు భగవద్గీత లాంటి దని వెల్లడించారు. ఈ మేనిఫెస్టోను అధికారంలోకి వచ్చాక తూచా తప్పకుండా పాటిస్తామని ఆయన వెల్లడించారు. సోనియాగాంధీ కారణంగానే తెలంగాణ వచ్చిందని… కానీ ఆమె ఆశయం ఇంకా తీరలేదని స్పష్టం చేశారు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ అధి కారంలోకి రాబోతుందని… భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం దారుణంగా విఫలమైందని మండిపడ్డారు.